Four Storey Residential Building Collapses In Lucknow after hits Earthquake: ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్రత్ గంజ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 15 కుటుంబాలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు సమాచారం. బృందాలు కొందరిని కాపాడాయి.
ఉత్తరాదిలో మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇజ్రత్ గంజ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు అంతస్తుల భవనంలో 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలుస్తోంది. మొత్తంగా 50కి పైగా మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
A whole building just fell to Earthquake in Lucknow!
Like pack of cards.
The most posh locality. And yet shame on the quality of construction. pic.twitter.com/t8CAdcveXx— TanRants (@LongIslandIcyT) January 24, 2023
యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పతక్ మీడియాతో మాట్లాడుతూ... 'ఇజ్రత్ గంజ్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సహాయక బృందాలు ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికి తీశాయి. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి' అని అన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: ICC ODI Team 2022: ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు.. భారత్ నుంచి ఇద్దరికే చోటు! కెప్టెన్‌గా బాబర్ ఆజామ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.