IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ..

Rohit Sharma Angry On Shardul Thakur: కివీస్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్ అటు బాట్యింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుకు పుంజుకుంటున్న సమయంలో వరుసగా వికెట్లు తీసి టీమిండియా గెలుపు సులువు చేశాడు. అయితే వరుసగా రెండు బంతుల్లో రెండు బౌండరీలు ఇవ్వడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఠాకూర్‌పై సీరియస్ అయ్యాడు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 05:48 PM IST
IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ..

Rohit Sharma Angry On Shardul Thakur: టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కివీస్‌ను వరుసగా మూడు వన్డేల్లో చిత్తు చేసిన భారత్.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇండోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 386 పరుగులు చేయగా.. కివీస్ 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

శార్దూల్ ఠాకూర్ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నా.. కెప్టెన్ రోహిత్ శర్మ అతనిపై కోప్పడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో బౌలింగ్ చేసిన శార్దూల్.. ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీశాడు. అయితే అదే ఓవర్‌లో చివరి రెండు బంతులను కాన్వే బౌండరీలకు తరలించాడు. శార్దూల్ షార్ట్ బాల్‌ను వరుసగా రెండుసార్లు ప్రయత్నించగా.. బ్యాక్-టు-బ్యాక్ ఫోర్లు కోట్టాడు. దీంతో రోహిత్‌ అసహనం వ్యక్తం చేస్తూ.. శార్దూల్ వద్దకు వెళ్లి సీరియస్ అయ్యాడు. దాదాపు 10 సెకన్ల పాటు బంతి ఇలానే వేసేదంటూ కోప్పడ్డాడు.

శార్దూల్ ఠాకూర్ తన తర్వాతి ఓవర్లో కూడా  మరో ఒక వికెట్ తీశాడు. ఈసారి అతను లైన్ ఆఫ్ వికెట్‌పై బౌలింగ్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో 25 పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 386 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్ (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు భారత్ భారీ స్కోరు చేసింది. హార్ధిక్ పాండ్యా (54; 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. అనంతరం న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌట్ అయింది. డెవాన్ కాన్వే 138 సెంచరీ వృథా అయింది. మిగిలిన బ్యాట్స్‌మెన్ అతనికి సహకారం లభించకపోవడంతో కివీస్ ఓటమి పాలైంది. 

Also Read: Balakrishna Sorry: సారీ చెప్పడానికి రెడీగా లేని బాలయ్య.. విషెస్ చెప్పాడు కానీ?

Also Read: Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News