Ayurvedic Solution For High Cholesterol: హార్ట్ పేషెంట్లు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సిరల్లో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి తీవ్ర స్ట్రోక్ వచ్చే ఛాన్స్‌లున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మందికి తెలయకుండానే రక్తంలో చక్కెర పరిమాణాలతో పాటు, చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి క్రమంలో తప్పకుండా మీరు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. ప్రమాదం ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవడానికి ఇంట్లో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వేటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందో తెలుసుకుందాం.
వీటిని తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది:
ఉసిరి కాయలు:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం అధికంగా పెరిగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో ఉసిరితో తయారు చేసిన ఆహారాలు గానీ, ఉసిరి రసాలు, పొడిని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
అర్జున చెట్టు బెరడు:
అర్జున చెట్టు బెరడుకు ఆయుర్వేద శాస్త్రంలో మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ బెరడును పొడిలా తయారు చేసుకుని ప్రతి రోజూ పాలలో కలుపుకుని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గుండె పోటు సమస్యలతో బాధపడేవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది.
వెల్లుల్లి:
ఆహారాల రుచిని పెంచడానికి వెల్లుల్లి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అందుకే వెల్లుల్లి చాలా మంది ఆహారాల రుచి పెంచడానికి వాడుతూ ఉంటారు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును నివారిస్తుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయ రసంలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ రసం తీసుకోవడం సులభంగా నియంత్రణలో ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!
Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook