హిందూశాస్త్రాల ప్రకారం ఫల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్ధశి తిధిన మహా శివరాత్రి జరుపుకుంటారు. ఈసారి మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన ఉంది. మహా శివరాత్రి ప్రత్యేక సందర్భంలో పలు దుర్లభమైన సంయోగాలు ఏర్పడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
మహా శివరాత్రి నాడు శివుడితో పాటు పార్వతీ దేవి పూజలు చేస్తారు. ఈ రోజున మహాదేవుడి వివాహం గౌరీదేవి సాంగత్యంలో జరిగిందని ప్రతీతి. అందుకే ఈ రోజుని అత్యంత వేడుకగా జరుపుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహా శివరాత్రి నాడు శివుడికి జలాభిషేకం చేస్తారు. స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే కష్టనష్టాలు, దుఖాల్ని తీరుస్తాడని నమ్మకం. ఈ రోజున ప్రత్యేకమైన కోర్కెల సాధన కోసం కొన్ని ఉపాయాలు ఆచరించాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మహా శివరాత్రి నాడు ఆచరించాల్సిన ఉపాయాలివీ..
శివుడి కోసం ఉపవాసం
మహా శివరాత్రి నాడు పూజాది కార్యక్రమాలు, వ్రతాలు ఉండటం వల్ల ప్రత్యేకమైన పుణ్యం లభిస్తుంటుంది. ఈ రోజున ఉదయం త్వరగా లేచి..స్నానమాచరించి..శివుడికి పూజలు చేయాలి. వ్రతం ఉండే సంకల్పం తీసుకోవాలి. శివుడి కోసం మహా శివరాత్రి నాడు వ్రతం ఆచరిస్తే..ఆ భక్తుల కోర్కెలు తప్పకుండా పూర్తి చేస్తాడని నమ్మకం.
ఈ రంగు బట్టలే ధరించాలి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహా శివరాత్రి రోజు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ శివుడి ఆశీర్వాదం తీసుకునేందుకు పూజలు చేసేటప్పుడు గ్రీన్ లేదా వైట్ బట్టలే ధరించాలి. ఇలా చేయడం మంచిదని చెబుతారు. ఆకుపచ్చ రంగు పచ్చదనానికి, తెలుపు రంగు శాంతికి ప్రతీక. ఒకవేళ మీ దగ్గర ఈ రెండు రకాల బట్టల్లేకపోతే..శుభ్రమైన బట్టలతో కూడా పూజలు చేయవచ్చు. అయితే నలుపు, నీలం రంగు బట్టలు మాత్రం ధరించకూడదు.
ఈ రంగు పూలతో
ఈ రోజున విధి విదానాలతో శివుడిని పూజించడం వల్ల శుభ ఫలాలు కలుగుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ రోజున పూజలో శివుడికి ప్రియమైన వస్తువులు అర్పిస్తే త్వరగా ప్రసన్నుడౌతాడు. ఈ రోజున శివుడికి అక్షింతలు, చందనం, గంగాజలం, థతూరా, పెరుగుతో పాటు ఎరుపు రంగు పూలు సమర్పించాలి. దీనివల్ల అంతా మంచి జరుగుతుందని ప్రతీతి. మీ మనస్సులో కోర్కెలు త్వరగా పూర్తవుతాయి.
శివలింగం పూజ
మహా శివరాత్రి రోజున ఇంట్లోకి శివలింగం తీసుకురావడం అత్యంత శుభసూచకంగా భావిస్తారు. ఈ రోజున శివుడు, శివలింగం పూజతో అభిషేకం చేస్తే..ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
Also read: Surya grahanam 2023: తొలి సూర్య గ్రహణం, ఈ 5 రాశులకు ఏప్రిల్ 20 నుంచి భయంకరమైన కష్టాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook