Surya grahanam 2023: తొలి సూర్య గ్రహణం, ఈ 5 రాశులకు ఏప్రిల్ 20 నుంచి భయంకరమైన కష్టాలు

Surya grahanam 2023: ఈ ఏడాది 2023లో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో 2 సూర్య గ్రహణాలు కాగా 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఈ రాశులవారికి తీవ్రమైన కష్టాలకు గురి చేస్తుంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2023, 06:57 AM IST
Surya grahanam 2023: తొలి సూర్య గ్రహణం, ఈ 5 రాశులకు ఏప్రిల్ 20 నుంచి భయంకరమైన కష్టాలు

ప్రతి యేటా ఏర్పడే గ్రహణాల ప్రభావం 12 రాశుల జీవితాలపై ఉంటోంది. ఈసారి 2023లో ఏర్పడనున్న 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ప్రభావం 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. కొన్ని రాశులకు అత్యంత శుభ సూచకమైతే..మరికొన్ని రాశులకు తీవ్ర నష్టాల్ని చేకూర్చనుంది. 

ఈ ఏడాది 2023లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడనుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల జీవితంలో కష్టాలు పెద్దఎత్తున పెరగనున్నాయి. ఈ గ్రహణం ఉదయం 7 గంటల 4 నిమిషాలకు ఏర్పడనుంది. మద్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకూ ఉంటుంది. ఈ గ్రహణం ఇండియాలో కన్పించదు. కానీ ఈ రాశి వారి జీవితంపై పెను ప్రభావం పడనుంది. 

ఈ రాశులపై సూర్య గ్రహణం ప్రభావం

మేషరాశి

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు ఆ సమయంలో సూర్యుడి మేషరాశిలో ఉంటాడు. ఈ క్రమంలో ఈ రాశివారి కెరీర్‌లో సమస్యలు పెరుగుతాయి. ఈ రాశివారి జీవితంపై సూర్యుడి ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో అత్యవసరమైన పనులు చాలావరకూ నిలిచిపోతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్య గ్రహణం మేషరాశి వారికి ఆర్ధిక సమస్యల్ని పెంచేస్తుంది. వ్యక్తికి మానసిక ఒత్తిడి ఎదుర్కోవల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

సింహరాశి

సూర్య గ్రహణం ఈ రాశి జాతకుల పనుల్ని పాడుచేస్తుంది. ఈ రాశి జాతకులకు చాలా కష్టనష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులకు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. కానీ ఆ తరువాత పరిస్థితులు చక్కబడతాయి.

కన్యారాశి

కన్యారాశి జాతకులకు కుండలిలో 8వ పాదంలో సూర్య గ్రహణం మానసిక కష్టాల్ని కలుగజేస్తుంది. మీలో కోపం పెరిగి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతారు. కొన్ని వస్తువులపై దృష్టి పెట్టడం వల్ల లాభముంటుంది. ఈ సందర్భంలో మీ వాయిస్ నియంత్రణలో ఉంచుకోకపోతే సమస్యలు మరింత జటిలమౌతాయి. యాత్రలు నష్టాల్ని కలగజేస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి 6వ పాదంలో సూర్య గ్రహణం ఏర్పడనుంది. దాంతో ఈ రాశి జాతకులు ప్రత్యర్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అందుకే సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం.

మకర రాశి

జ్యోతిష్యం ప్రకారం మకర రాశి జాతకులకు కుండలిలో 4వ పాదంలో సూర్య గ్రహణం ఏర్పడటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడనుంది. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. అనవసరపు వృధా ఖర్చులు బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: Mercury transit 2023: బుధుడు మకరరాశి ప్రవేశం.. ఇవాళ్టి నుండి ఈ రాశులపై కనక వర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News