Viral Video today: భానుడు భూమి మీదకు వస్తున్న సమయంలో ఏర్పడిన భూకంపం ఎంతో మంది జీవితాలను అస్తమయం చేసింది. అప్పుడే నిద్రలోంచి బయటకు వస్తున్న ఆ జనాలను శాశ్వతంగా గాఢ నిద్రలోకి పంపించేసింది. ఎన్నో బంధాలను చిదిమేసింది. గూడు నీడ లేకుండా చేసింది. ఆప్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఆక్రనందన చేసింది. ఇన్ని భయానక పరిస్థితుల మధ్య ఓ చిన్నారి చేసిన సాహసం అందరీ హృదయాల్ని కదలించింది.
సోమవారం తుర్కియేలో ఏర్పడిన భూకంపం పక్క దేశాల్లో కూడా ప్రకంపనలు సృష్టించింది. ఈ భూకంపం ధాటికి ముఖ్యంగా సిరియాలో చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వేలాది భవానాలు నేలమట్టమయ్యాయి. ఈ శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అధికారులు రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. ఆ సమయంలోనే ఓ హృదయావిధారకర దృశ్యం కనిపించింది.
భూకంపం ధాటికి తను ఉంటున్న భవనం కూలిపోయి.. శిథిలాల కింద చిక్కుకుపోయారు ఓ అక్కాతమ్ముడు. ఓవైపు తాను బండరాయి కింద నలిగిపోతున్నా మరోవైపు తమ్ముడికి ఏమీ కాకూడదని ఏకధాటిగా 17 గంటల పాటు అతడి తలకు చెయ్యి అడ్డుగా పెట్టి కాపాడింది ఏడేళ్ల బాలిక. ప్రస్తుతం ఈ ఫిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె సాహసాన్ని పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. వారిద్దరినీ సురక్షితంగా అధికారులు బయటకు తీశారు.
While under the rubble of her collapsed home this beautiful 7yr old Syrian girl has her hand over her little brothers head to protect him.
Brave soul
They both made it out ok. pic.twitter.com/GrffWBGd1C— Vlogging Northwestern Syria (@timtams83) February 7, 2023
Also Read: Turkey Earthquake: భారీ భూకంపం సమయంలో మహిళ ప్రసవం.. కుప్పకూలిన భవనాల కింద పసికందు సేఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి