Canara Bank: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. లోన్లపై వడ్డీ రేట్లు మరింత చౌక.. రేపటి నుంచే అమలు

Canara Bank Cuts Interest Rate: కెనరా బ్యాంక్ తమ ఖాతాదారులకు తీపికబురు అందించింది. ఆర్బీఐ రెపోరేటును పెంచినా.. కెనరా బ్యాంక్ మాత్రం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 15 బేసిస్ పాయింట్లు తగ్గించగా.. రేపటి నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 09:13 PM IST
Canara Bank: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. లోన్లపై వడ్డీ రేట్లు మరింత చౌక.. రేపటి నుంచే అమలు

Canara Bank Cuts Interest Rate: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో అన్ని బ్యాంకులు కూడా తమ వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే లోన్లపై నేరుగా ప్రభావం పడుతోంది. అయితే ఆర్బీఐ రెపో రేటును పెంచినా.. కెనరా బ్యాంక్ మాత్రం కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. లోన్ వడ్డీ రేటును 0.15 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్)ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

ప్రస్తుతం కెనరా బ్యాంక్ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్ 9.40 శాతం ఉంది. తాజా తగ్గింపుతో 9.25 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ రెపో రేటును ప్రకటించిన వెంటనే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచగా.. కెనరా బ్యాంక్ 15 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం. 

అంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ రేట్లను 0.25 శాతం పెంచగా.. 8.85 శాతానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఒకరోజు ఎంసీఎల్‌ఆర్ రేటును 8.30 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ అంతకుముందు 8.30 నుంచి 8.55 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ నుంచి 8.85 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇది 8.60 శాతంగా ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.85 శాతం నుంచి 7.90 శాతానికి 5 బీపీఎస్ పెరిగిందని, ఒక నెల కాలవ్యవధిని 5 బీపీఎస్ నుంచి 8.20 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. అదేవిధంగా మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ను 8.25 శాతం నుంచి 8.30 శాతానికి, ఆరు నెలలకు 8.40 శాతానికి, ఏడాదికి 8.55 శాతానికి పెంచినట్లు తెలిపింది.  

Also Read: KL Rahul Flop Show: కేఎల్ రాహుల్‌కు ఫేవరెటిజం వల్లే చోటు.. టీమిండియా సెలక్షన్‌పై మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్లు   

Also Read: Ravindra Jadeja: రవీంద్ర జాడేజాకు ఫైన్.. ఆ వీడియోలో ఏం జరిగిందంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News