Trivikram Influence on Pawan Kalyan: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు అన్న మాట ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి మొట్టమొదటిసారిగా 2008వ సంవత్సరంలో జల్సా అనే సినిమా చేశారు. వాస్తవానికి త్రివిక్రమ్ చేసిన రెండవ సినిమా అతడు సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. అయితే తాను కథ చెప్పడానికి వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ నిద్రపోయాడని ఆ విషయంలోనే పవన్ కళ్యాణ్ నాకు నచ్చడు అని త్రివిక్రమ్ పలు సందర్భాలలో చెబుతూ వస్తారు. అయితే తర్వాత పరిణామాలలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది.
ఆ తర్వాత వీరిద్దరూ వరుసగా జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలకు కూడా కలిసి పనిచేశారు. ఇక వీరిద్దరి మధ్య బంధం ఎంతగా కొనసాగిందంటే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కోసం త్రివిక్రమ్ స్పీచ్ లు కూడా రాసేంతలా వారిద్దరూ అతి సన్నిహిత స్నేహితులైపోయారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుందని ఆయన చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటున్నారు, కొన్ని రీమేక్ సినిమాలు కూడా ఒప్పుకుంటున్నారని, పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు రీమేక్ సినిమాలు చేసి కొన్ని హిట్లందుకుంటే ఎక్కువగా ఫ్లాపులు అందుకున్నారు.
ఇప్పుడు కూడా ఆయన తేరి సినిమా రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారని వినోదయ సిత్తమ్ అనే తమిళ సినిమా రీమేక్ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అందరికీ తెలుసు. అలా ఆయన చేయడానికి గల కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ సెలక్షన్లో త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని పవన అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే విషయం మీద అనేక సందర్భాలలో చర్చ కూడా జరిగింది. ఇక ఈ విషయం మీద తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు చేసే బ్యానర్ నిర్మాత నాగ వంశీ స్పందించారు. సార్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆయన ఈ విషయం మీద స్పందించారు.
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మంచి స్నేహితులని పేర్కొన్న నాగ వంశీ ఇద్దరూ ఎప్పుడు సమయం దొరికినా కలిసి టైం స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారని అన్నారు. అయితే ఒకరి సినిమాల విషయంలో మరొకరి ప్రమేయం ఉండదని ఒకరి సినిమాల గురించి ఒకరు చర్చిస్తారు తప్ప వాటి మీద మరొకరు ఇన్ఫ్లుయెన్స్ అయితే కచ్చితంగా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇక నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన వాతి సినిమా తమిళంలో, సార్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యాయి. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా అలవైకుంఠపురంలో సినిమా హిందీ రీమేక్ షెహజాదా కూడా ఇదే రోజు హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read: Dhanush Silent Craze: ధనుష్ కి తెలుగులో ఏమన్నా క్రేజ్ ఉందా..అన్ని షోస్ హౌస్ ఫుల్లే!
Also Read: Shehzada vs Pathaan: 'అల' రీమేక్ కు దిమ్మతిరిగే షాక్.. దెబ్బకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook