These 6 Zodiac Signs Will Get Immense Money Due to Shani Nakshatra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... శనిని కర్మ ప్రదాత అని అంటారు. ఓ వ్యక్తి యొక్క కర్మలను బట్టి శని దేవుడు ఫలాలను ఇస్తాడు. మార్చి 15వ తేదీన ఉదయం 11.40 గంటలకు శని దేవుడు శతభిషా నక్షత్రం మొదటి దశలో సంచరిస్తాడు. 17 అక్టోబర్ 2023 వరకు అక్కడే ఉంటాడు. ఈ శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతి. అయితే శని ఎల్లప్పుడూ అశుభ ఫలితాలను ఇవ్వడు. కొన్ని రాశుల వారికి చాలా శుభం మరియు కొందరికి అశుభంగా ఉంటుంది. శతభిష నక్షత్రంలో శని సంచారం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోందో ఇప్పుడు చూద్దాం.
మేషం:
కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు ఆర్థికంగా లాభపడతారు. శని దేవుడు శతభిషా నక్షత్రంలో తన మూల త్రిభుజ రాశిలో ఉంటాడు. దీనివల్ల మేష రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
మిథునం:
ఈ సమయంలో మిథున రాశి వారు కష్టపడి పని చేయాలి. వచ్చిన అవకాశాలను జారిపోకుండా చూడాలి. మిథున రాశి వారు కెరీర్ పరంగా మంచి శుభ ఫలితాలను పొందుతారు. చాలా కాలంగా ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం చూస్తున్న వారి కోరికలు నెరవేరుతాయి. ఆర్ధికంగా బాగుంటుంది.
సింహం:
సింహ రాశి వారికి శని దేవుడి రాశిలో మార్పు గొప్ప ఫలితాలను ఇస్తుంది. డబ్బు విషయంలో మంచి ప్రయోజనం ఉంటుంది. శతభిషా నక్షత్రంలో శని ఉండటం వల్ల ఉద్యోగస్తులకు బదిలీ, విజయం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఆఫర్లు లభిస్తాయి. శని నక్షత్రం మారడం వల్ల వ్యాపారులకు కూడా లాభాలు ఉంటాయి.
తులా:
తులా రాశి వారికి శని రాశి మార్పు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ కాలం తులా రాశి వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభం కలుగుతుంది. డబ్బు సంపాదించడానికి షార్ట్‌కట్‌లు మీకు లభిస్తాయి. అదేసమయంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ధనస్సు:
శని నక్షత్రం మారడం ద్వారా ధనస్సు రాశి వారికి ఉద్యోగం పొందవచ్చు. బదిలీ మరియు జీతంలో కూడా పెరుగుదల ఉండవచ్చు. ప్రతి రంగంలో విజయం మీ చెంతే ఉంటుంది. ఈ నక్షత్ర సంచారం చాలా అదృష్టవంతులు కానుంది.
మకరం:
శతభిషా నక్షత్రంలో శని ఉండటం వల్ల మకర రాశి వారు ప్రారంభించే పని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. శతభిషా నక్షత్రంలో ఉన్న శని దేవుడు వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలను ఇస్తాడు. ఈ సమయంలో మీ వ్యాపారం ముందుకు వెళుతుంది.
Also Read: Hyundai 7 Seater Car: ఇక సఫారీని మరచిపోవాల్సిందే.. బెస్ట్ 7 సీట్ కారు వచ్చేసింది! ధర కూడా తక్కువే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.