ఇండియాలో ఇటీవలే 5జి సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అగ్రశ్రేణి, టైర్ 2 నగరాల్లో 5జి సేవలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆఖరుకు దేశం మొత్తం 5జి సేవలు ప్రారంభం కావచ్చనే అంచనా ఉండగానే..6జి సేవలపై చర్చ మొదలైంది.
భారత టెలీకం రంగానికి దక్కిన జీఎస్ఎమ్ గ్లోబల్ అవార్డు గురించి కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో ఇప్పటికే 5జి నెట్వర్క్ విస్తరిస్తోంది. ప్రపంచ దేశాల మాదిరిగానే 6జి టెక్నాలజీ విషయంలో ముందుండాలని ఇండియా కోరుకుంటోందని చెప్పారు. 6జి సేవల కోసం ఇండియా 100 పేటెంట్లను పొందిందన్నారు. టాస్క్‌ఫోర్స్ నుంచి నివేదిక అందిన తరువాత దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఈ దశాబ్దం ఆఖరుకు దేశంలో 6జి నెట్వర్క్ ప్రారంభం కానుందని కేంద్రమంత్రి వైష్ణవ్ తెలిపారు. అంటే మరో ఏడేళ్లలో 6జి నెట్వర్క్ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. 2024 డిసెంబర్ నాటికి దేశమంతా 5జి సేవలు విస్తరిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో టెలీకం రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలుంటాయన్నారు. గ్లోబల్ స్పీడ్ టెస్ట్‌లో కూడా ఇండియా స్థానం 118 నుంచి 49కు చేరుకుందన్నారు. ఇండియాలో ప్రస్తుతం 99 శాతం మేడిన్ ఇండియా స్మార్ట్‌ఫోన్స్ వినియోగిస్తున్నారన్నారు. దేశంలో తయారైన 10 మిలియన్ డాలర్ల విలువైన మొబైల్స్ ప్రతియేటా ఎగుమతి అవుతున్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు.
మరోవైపు దేశంలో యూపీఐ చెల్లింపులు, వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందన్నారు. 50-60 దేశాలు యూపీఐ విధానాన్ని అవలంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. దక్షిణ కొరియా కూడా 2028 నాటికి 6జి సేవలు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అదే జరిగితే 6జి సేవలు అందుబాటులో తీసుకొచ్చే తొలిదేశం కానుంది. ఇందుకయ్యే ఖర్చు 3,978 కోట్లను మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
Also read: UIDAI Updates: మీ ఆధార్ కార్డు మరింత సురక్షితం, ఇకపై కొత్త సెక్యూరిటీ మెకానిజంతో వెరిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook