అదానీ గ్రూప్ ఇప్పుడు హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. కంపెనీలో షేర్లు విక్రయించడం ద్వారా 15 వేల కోట్లను అదానీ గ్రూప్ సమీకరించింది. మొత్తం నాలుగు లిస్టెడ్ కంపెనీల్లో స్వల్ప వాటాను అదానీ గ్రూప్ విక్రయించింది.
అమెరికనన్ కంపెనీ జీక్యూజీ పార్టనర్స్‌కు అదానీ గ్రూప్ నాలుగు లిస్టెడ్ కంపెనీల్లోని 15,446 కోట్ల వాటాను విక్రయించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు నిరంతరం పడిపోతూ వస్తున్నాయి. ఇటీవల రెండ్రోజుల్నించి అదానీ గ్రూప్ షేర్లు తిరిగి పుంజుకుంటున్నా..అదానీ గ్రూప్ కొంత వాటాను విక్రయించేసింది. మరోవైపు హిండెన్‌బర్గ్ నివేదిక విషయంలో దర్యాప్తుకు ఆదేశించిన సుప్రీంకోర్టు 6 సభ్యుల కమిటీ నియమించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజస్‌లలోని కొంతవాటాను 15,446 కోట్లకు అదానీ గ్రూప్ విక్రయించింది.
స్టాక్ ఎక్స్చేంజ్ వివరాల ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ క్యాపిటల్లో 3.39 శాతం లేదగా 38.7 మిలియన్ షేర్లను జీక్యూజీ పార్టనర్స్‌కు విక్రయించింది. ఒక్కొక్క షేరును 1410.86 రూపాయల చొప్పున 5,460 కోట్ల వాటాను దక్కించుకుంది. ఇక అదానీ పోర్ట్స్‌లో 88.6 మిలియన్ షేర్లు లేదా 4.1 శాతం వాటను జీక్యూజీ కంపెనీ 5,282 కోట్లకు కైవసం చేసుకుంది. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.55 శాతం వాటాను 1898 కోట్లకు విక్రయించింది. ఇక అదానీ గ్రీన్ ఎనర్జీలో 3.51 శాతం వాటాను 2806 కోట్లకు విక్రయించింది.
అయితే ఈ లావాదేవీల వెనుక ఉద్దేశ్యాన్ని అదానీ గ్రూప్ అధికారికంగా వెల్లడించలేదు. రుణాల్లో కొంతమేర తిరిగి చెల్లించేందుకే ఈ అమ్మకాలు జరిపినట్టుగా తెలుస్తోంది. హిండెన్‌బర్గ్ ఆరోపణల అనంతరం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొంతమేర రుణాల్ని గడువుకు ముందే చెల్లించేందుకు సిద్ధమైంది. మార్చ్ ఆఖరుకు 690 నుంచి 790 మిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది ఏసీసీ, అంబూజా సిమెంట్స్ కొనుగోలు నిమిత్తం తీసుకున్న 4.5 బిలియన్ డాలర్ల రుణాల్లో..500 మిలియన్ డాలర్లను చెల్లించే అవకాశాలున్నాయి.
జీక్యూజీ పార్టనర్స్‌తో కుదిరి బ్లాక్ డీల్స్ కారణంగా నిన్న కూడా అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెరుగుదల కన్పించింది. అదానీ మార్కెట్ వాటా 7.86 లక్షల కోట్లకు చేరుకుంది.
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Adani group: 15 వేల కోట్ల షేర్లను అమ్మేసిన అదానీ గ్రూప్, రుణాలు తీర్చేందుకేనా