Shani Surya Budh Yuti 2023: మూడు గ్రహాల ముచ్చటైన కలయికతో..ఆ 5 రాశులు ఊహించని సంపదతో ఉక్కిరిబిక్కిరౌతారా

Shani Surya Budh Yuti 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది కొన్నిసార్లు గ్రహాల గోచారంతో పాటు యుతి ఏర్పరుస్తుంటాయి. దీనివల్ల విభిన్న రకాలైన పరిణామాలు ఎదురౌతుంటాయి. అవి అనుకూలంగా, ప్రతికూలంగా ఉండవచ్చు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2023, 07:30 AM IST
Shani Surya Budh Yuti 2023: మూడు గ్రహాల ముచ్చటైన కలయికతో..ఆ 5 రాశులు ఊహించని సంపదతో ఉక్కిరిబిక్కిరౌతారా

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల పరివర్తనం లేదా గోచారానికి చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల రాశి పరివర్తనంతో ఏర్పడే యుతితో శుభ, అశుభ పరిణామాలు కలుగుతుంటాయి. ప్రస్తుతం శని, బుధ, సూర్య గ్రహాల యుతి ఏర్పడనుండటంతో ఆ 5 రాశులపై అంతులేని లాభాలు వర్షించనున్నాయి. ఊహించని సంపద ఆ రాశులకు కలిసొస్తుంది.

జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీన గ్రహాల రాజు సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించి ఉన్నాడు. అదే సమయంలో 14 రోజుల తరువాత అంటే ఫిబ్రవరి 27వ తేదీ గ్రహాల రాజకుమారుడు బుధుడు కూడా అదే రాశిలో చేరాడు. రెండు గ్రహాల మధ్య ఉన్న మిత్రత్వం కారణంగా గౌరవ ప్రతిష్ఠలు, ఆర్ధిక లాభాలు కలుగుతాయనేది జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న మాట. సూర్యుడు, శని, బుధుడు మూడింటి ప్రవేశంతో ఇంకా మంచి జరగనుంది. కానీ కష్టపడకుండా ఏదైనా సాధించడం మంచిది కాదు. ఇప్పటికే ఈ ఐదు రాశులవారికి దశ తిరిగిపోయింది. 

మేష రాశి

మూడు గ్రహాల కలయిక వల్ల మేషరాశి జాతకులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్ధులు అనుకున్నది సాధించేందుకు కష్టపడటంతో పాటు సోదరుడి సహకారం అవసరమౌతుంది. ఆదాయం శరవేగంగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి పదోన్నతులతో పాటు బదిలీలు కూడా ఉంటాయి. మీ నెరవేరని కోర్కెలు పూర్తి చేసేందుకు సరైన సమయమే కానీ తొందరపాటు లేకుండా చూసుకోవాలి.

వృషభ రాశి

చేసే ఉద్యోగం నచ్చక కొత్త ఉద్యోగం కోసం ఎదరుచూస్తుంటే ఇదే సరైన సమయం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే మంచి ఫలితాలుంటాయి. వ్యాపారులకు చాలా అనువైన సమయం. వ్యాపారం వృద్ధి చెందుతుంది. చట్ట విరుద్ధమైన పనుల్నించి కాపాడుకోండి. ఇంట్లో మొక్కలు పెంచడం మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

కన్యా రాశి

కన్యా రాశి జాతకులు పెద్దగా కష్టపడకుండానే ఆర్ధిక ప్రయోజనం పొందుతారు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. చతుర్ధ శ్రేణి సిబ్బందికి ఉపహారాలివ్వాలి. పనిచేసేచోట మంచి వాతావరణం ఉంటుంది. పాత అప్పులు చెల్లించేస్తారు. కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. 

తులా రాశి

ఈ రాశివారికి అత్తారింటి నుంచి శుభవార్త వినే అవకాశాలున్నాయి. ఇందులో చాలా లాభం కలగనుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరమైనవారిని ఆదుకోవాలి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగొస్తాయి. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారి ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇదే సమయంలో ఏదైనా కీలకమైన ఆస్థి కొనుగోలు చేస్తారు. ఆస్థి కొనుగోలు చేసే సమయంలో అక్రమం కాకుండా చూసుకోవాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. మీ పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. సేవింగ్స్‌పై ధ్యాస పెట్టాలి. తల్లి ఆరోగ్యం మెరుగవుతుంది. ఎముకలకు సంబంధించిన రోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Also read: Shani Sade Sati 2023: ఆ మూడు రాశులకు 2025 మార్చ్ 29 వరకూ ఏం జరగనుంది. శని దోషం తప్పించే మార్గాలేంటి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News