Figs Side Effects: అంజీర్ పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో బాడీ శక్తిని పెంచే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి అంజీర్ ప్రతి రోజూ తినడం వల్ల కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు మెదడు బూస్ట్ చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యల పెంచడానికి కూడా సహాయపడతాయి. అయితే అంజీర్ పండ్లను అతిగా తినడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిటి ఎక్కువగా తినడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అంజీర్‌ను ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అస్సలు తీసుకోవద్దు:
1. అంజీర్ అల్సర్లకు కారణం కావొచ్చు:
అంజీర్‌ను అతిగా తినడం వల్ల పొట్టలోని అల్సర్ వంటి సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అత్తి పండ్లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దీనిని అతిగా తినడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారీ తీయోచ్చు.
2. కాలేయ సమస్యలు పెరగవచ్చు:
కాలేయ సమస్యలో బాధపడేవారు అస్సలు వీటిని తినకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కాలేయ సమస్యలకు దారి తీసే చాలా రకాల గుణాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల కాలేయం నొప్పి, కాలేయ బలహీనత, ఇతర తీవ్ర సమస్యలకు దారీ తీయోచ్చు. అంతేకాకుండా కొందరిలో కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా దారీ తీయోచ్చని నిపుణులు చెబుతున్నారు.
3. గ్యాస్ సమస్యలకు దారీ తీయోచ్చు:
అతిగా అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలకు దారీ తీయోచ్చు. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ బలహీనంగా మారే అవకాలు కూడా ఉన్నాయి. కొంత మందిలో అసిడిటీ సమస్యలకు కూడా దారీ తీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
వీటిని ఇలా తింటే చాలా ప్రయోజనాలు:
అంజీర్ పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటంటే, 1 నుంచి 2 అత్తి పండ్లను రాత్రిపూట ½ కప్పు నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో తినండి. అంతేకాకుండా పాలలో ఈ పండ్లను ఉడికించి ఆపై తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook