Green Papaya For Dandruff Removal: జుట్టులో చుండ్రు అనేది ప్రస్తుతం సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్యలతో వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వివిధ రకాల రసాయన ఉత్పత్తులను వినియోగించడం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో జుట్టు శుభ్రపరచడం లేకపోవడం వల్ల చుండ్రు సమస్య తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. పచ్చి బొప్పాయి-పెరుగును జుట్టుకు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి బొప్పాయి జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైమ్‌లు లభిస్తాయి. ఇవి స్కాల్ప్‌కు పోషణని ఇవ్వడమేకాకుండా జుట్టును బలంగా, ఒత్తుగా చేయడానికి సహాయపడతాయి. అయితే పెరుగు, బొప్పాయి మిశ్రమాన్ని వినియోగించడం వల్ల స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
చుండ్రుని తొలగించడానికి బొప్పాయి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో తెలుసా?:
ముందుగా మూడు చెంచాల పచ్చి బొప్పాయి గుజ్జును తీసుకోవాలి.
తర్వాత దానిలో 2 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ త్రిఫల పొడిని కలపండి.
ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి.
మీరు దీన్ని మిక్సర్‌తో మెత్తగా మిక్స్ చేసుకోవాలి.
పచ్చి బొప్పాయి హెయిర్ మాస్క్‌ని ఇలా జుట్టుకు అప్లై చేయండి:
మొదటగా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత బొప్పాయి-పెరుగు హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది.
1 గంట అలా ఆరనివ్వండి.
హెయిర్ మాస్క్ ఆరిపోయిన తర్వాత మళ్లీ తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.
ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ప్రయోజనాలు:
బొప్పాయి-పెరుగు హెయిర్ మాస్క్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వాటిని రూట్ నుండి బలపరుస్తుంది. అలాగే ఇది చుండ్రును పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇది జుట్టులో దురదను కూడా తొలగిస్తుంది. దీని వాడకం వల్ల జుట్టుకు సహజమైన మెరుపు కూడా వస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook