Allu Arjun Wedding Anniversary : అప్పుడలా ఇప్పుడిలా.. భార్యను ముద్దుగా పిలిచిన బన్నీ

Allu Arjun Wedding Anniversary అల్లు అర్జున్ ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా బన్నీ, స్నేహా రెడ్డి ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. పులులు, సింహాలను చూస్తూ తిరుగుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 01:14 PM IST
  • అల్లు అర్జున్‌కు పెళ్లై పన్నెండేళ్లు
  • భార్యపై ప్రేమను కురిపించిన బన్నీ
  • క్యూటీ అంటూ ముద్దుగా పిలిచిన అల్లు అర్జున్
Allu Arjun Wedding Anniversary : అప్పుడలా ఇప్పుడిలా.. భార్యను ముద్దుగా పిలిచిన బన్నీ

Allu Arjun Sneha Reddy Wedding Anniversary అల్లు అర్జున్ స్నేహా రెడ్డిల వివాహా బంధానికి పుష్కరకాలం అవుతోంది. పెళ్లి జరిగి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా విషెస్ అందించాడు బన్నీ. స్నేహారెడ్డిని ఎప్పుడూ ముద్దు పేరుతో పిలుస్తుంటాడు బన్నీ. తన భార్య మీద ఎప్పుడూ నాటీ కామెంట్లు వేస్తుంటాడు. నిహారిక పెళ్లికి వెళ్తున్న సమయంలో ఫ్లైట్‌లో తన భార్యను చూపిస్తూ సెక్సీగా ఉంది కదా? అని బన్నీ అనేశాడు. ఇప్పుడు క్యూటీ అని వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పేశాడు బన్నీ.

అల్లు స్నేహారెడ్డి అల్లు అర్జున్‌ పెళ్లి 2011లో జరిగిన సంగతి తెలిసిందే. స్నేహారెడ్డిని పబ్బులో ప్రైవేట్ పార్టీలో మొదటి సారిగా చూసి ఫిదా అయ్యాడట. అలా తొలిచూపులోనే బన్నీ ప్రేమలో పడిపోయాడట. ఇక ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అలా చివరకు 2011లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు బన్నీ.

బన్నీ స్నేహా రెడ్డి, అయాన్, అర్హల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. బన్నీ తన కొడుకు, బిడ్డలత ఎంతో సరదాగా గడుపుతుంటాడో మనం చూస్తుంటాం. బన్నీ వీడియోలను, పిల్లల అల్లరిని సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. అందుకే స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది.

బన్నీ, స్నేహారెడ్డి ఇప్పుడు వెకేషన్‌లో ఉన్నారు. ఆఫ్రికాలోని అడవుల్లో తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. పులులు, సింహాలు, జింకలు ఇలా రకరకాల జంతువుల ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పెడుతూనే వస్తోంది. ఇంకా వెకేషన్‌లోనే ఈ జోడి ఉన్నట్టుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. రీసెంట్‌గానే బన్నీ తన కొత్త సినిమాను ప్రకటించాడు. టీ సిరీస్ ఆధ్వర్యంలో సందీప్ రెడ్డి వంగాతో ఈ సినిమాను చేయబోతోన్నట్టుగా అల్లు అర్జున్ ప్రకటించాడు. కానీ ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనేది క్లారిటీగా చెప్పలేదు.

Also Read:  Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్

Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News