Special Holiday for Women Employees on International Womens Day 2023: రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ (TS Govt) గుడ్‌న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం (మార్చి 8)న మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడంపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women's Day 2023) రోజున మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉండనుంది. ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 (International Women’s Day 2023) సందర్భంగా సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నట్లు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మార్చి 8న రూ. 750 కోట్ల రుణాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఏ మేరకు ఎదుగుతున్నారో గుర్తించే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి. మార్చి 8న హోలీ పండుగ కూడా ఉండటంలో రాష్ట్రంలోని విద్యా సంస్ధలకు ఆరోజు సెలవు ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Aslo Read: Apple iPhone 14 New Color: కొత్త రంగులో ఐఫోన్ 14.. త్వరలోనే అందుబాటులోకి! పూర్తి వివరాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.