Holi Tips in Telugu: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఈ వేడుకలు నిన్నే మొదలైపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈరోజు జరుగుతున్నాయి. అయితే ఒకప్పుడు హోలీ అంటే సహజ సిద్ధంగా తయారైన రంగులతో జరుపుకునే వారు. కానీ ఇప్పుడు అంతా సింథటిక్ టెక్నాలజీతో వాడిన రంగులు పూసుకుంటూ ఉండటంతో ఆ మరకలను వదిలించుకోవడం పెద్ద పనిగా మారిపోయింది. ఇక ఎప్పుడూ లేని విధంగా కోడిగుడ్డు కూడా వేసుకుని కొట్టుకుంటూ ఉండడంతో ఆ రంగురంగుల కోడిగుడ్లు కలిసి మరకలు పడుతున్నాయి.
ఈ మరకలు త్వరగా పోవాలంటే వాటిని ఎప్పుడు కడగాలి? ఎలా కడగాలి? ఈ వేటితో కడిగితే త్వరగా వదులుతుందనే విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అసలు హోలీ ఆడటానికి వెళ్లే ముందే ఒంటికి కాస్త కొబ్బరి నూనె కానీ గ్లిజరిన్ ఆయిల్ కానీ పూసుకుంటే మంచిది. తర్వాత రంగులు పోగొట్టుకునే ప్రయత్నంలో పెట్రోల్ లేదా కిరోసిన్ వంటి వాటిని రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది అంత శరీరానికి మంచిది కాదని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు.
శరీరానికి అంటే మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల ఆ రంగులు త్వరగా మారిపోతాయని అయితే మరీ వేడి నీళ్లు మాత్రం అస్సలు వాడకూడదని చెబుతున్నారు. ఇక సెనగపిండిలో కొంచెం పాలు పెరుగు రోజ్ వాటర్ బాదం నూనె కలిపి ఒక పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని రంగులాంటిన చోట పట్టించాలి, ఆ తర్వాత అరగంట పాటు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఆ రంగులన్నీ వదిలి పోతాయి. ఒంటికి అంటిన రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్ రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకోవాలి. ఇక తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే దురద కూడా తగ్గుతుంది.
తర్వాత ముఖానికి ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకుంటే దురద నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాయాలి. కచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం మరచిపోవద్దు. ఇక తలకు అంటుకున్న రంగులు, కోడిగుడ్డు వాసన పోవాలంటే మళ్ళీ పెరుగులో కోడి గుడ్డు సోన కలిపి తలకు పట్టించి గంట తర్వాత మంచి షాంపుతో స్నానం చేయాలి. ఇక చాలా మంది దుస్తుల విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత మంది తెలివిగా హోలీ రోజు పాత బట్టలు వేసుకుని బయటికి వెళ్తే కొంతమంది మాత్రం కొత్త బట్టలు వేసుకుని ఇరుక్కుపోతూ ఉంటారు.
అలా కొత్త బట్టలకు కూడా అంటిన రంగు వదిలించాలంటే నిమ్మ రసాన్ని ఆ రంగుల మీద రుద్ది వేడి నీళ్లలో నానబెట్టి ఉతకాలి. లేదా అర కప్పు వెనిగర్‌లో ఒక చెంచా లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని చల్లటి నీటిలో వేసి రంగులంటిన బట్టలు నానబెట్టాలి. గంట తర్వాత వాటిని బయటకు తీసి ఉతికితే రంగులు పోతాయి. తెల్ల దుస్తులకు అంటిన మరకలు పోవాలంటే క్లోరిన్ లో వాటిని నానబెట్టి గంట తర్వాత గోరువెచ్చని నీటిలో ఉతికితే ఆ మరకలు పోతాయి.
Also Read: Summer Skin Care: సమ్మర్లో చర్మ సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసా?
Also Read: Happy Holika Dahan Wishes:హోలీ శుభాకాంక్షలు కలర్ ఫుల్ గా చెప్పేయండిలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి