Telangana Cabinet Decisions: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇళ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయాన్ని ఆమోదించింది మంత్రి మండలి.
కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
==> దళితబంధు, డబుల్ బెడ్ రూమ్, పోడు భూముల ఇళ్ల పట్టాలపై చర్చ
==> రెండో విడత దళితబంధు లక్షా 30 వేల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం.. దళితబంధు వేడుకలను ఆగస్టు నెలలో ప్రతీ ఏటా నిర్వహించాలి.. 119 నియోజకవర్గాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ చేయాలి
==> సొంత జాగ ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో నామకరణం.. 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇవ్వాలని నిర్ణయం.. పథకం కోసం 12 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపు.. కట్టే ఇళ్ళన్ని మహిళ పేరుమీద ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
==> ప్రతీ ఇంటికి 3 లక్షల రూపాయలను గ్రాంట్‌గా మూడు దఫాలుగా ఇవ్వాలి
==> గత ఇందిరమ్మ పథకంలో 4 వేల కోట్ల అప్పులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం
==> గొర్రెల పంపిణీ స్కీమ్: 7 లక్షల లబ్ధిదారుల్లో గతంలో 50 శాతం పూర్తి చేశాం. 4 వేల కోట్లకు పైగా మళ్లీ నిధులు కేటాయించి.. మరో సగం మందికి ఆగస్టు నెలలో పంపిణీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం.. కలెక్టర్ పర్యవేక్షణలో గొర్రెల పంపిణీ జరగాలి.
==> పోడు భూముల అంశం: లక్షా 55వేల 393 మందికి పట్టాల పంపిణీ చేసేందుకు ఆమోదం.. పోడు ప్రక్రియ కొనసాగింపు ఉంటుంది
==> అంబేడ్కర్ విగ్రహం ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం.. ఏప్రిల్ 14న భారీ బహిరంగ సభ
==> జీవో 58, 59 ఒక్క రూపాయి లేకుండా పేదలకు ఇంటిపై హక్కును కల్పించాలని కేబినెట్ నిర్ణయం.. జీవో 58 కింద లక్షా 45 వేల మందికి పట్టాలు ఇప్పటికే ఇచ్చాం. కటాఫ్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.. జీవో 59 కింద 42 వేల మంది లబ్ధి పొందారు
==> కాశీలో తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఒక వసతి గృహం నిర్మించాలని కేబినెట్ నిర్ణయం.. రూ.25 కోట్ల నిదులు మంజూరుకు ఆమోదం.. శబరిమలలో 25 కోట్లతో వసతి గృహం నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్
==> నెల రోజుల వ్యవధిలోనే సెక్రటేరియట్, అమరుల ఖ్యాతి ద్వీపం, అంబేడ్కర్ విగ్రహం ప్రారంభం ఉంటుంది
Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు
Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook