అలాంటి వాళ్లు గోవాకు రావొద్దు : గోవా మంత్రి మనోహర్

గోవాకు మంచి పర్యాటకులు మాత్రమే రావాలి: గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గాన్కర్ 

Last Updated : Jul 27, 2018, 01:48 PM IST
అలాంటి వాళ్లు గోవాకు రావొద్దు : గోవా మంత్రి మనోహర్

గోవా సంస్కృతిని గౌరవించే సత్ప్రవర్తన కలిగిన పర్యాటకులను తమ మాత్రమే రాష్ట్రానికి ఆహ్వానిస్తామని గోవా పర్యాటక శాఖ మంత్రి మనోహర్ అజ్గాన్కర్ స్పష్టంచేశారు. ‘‘గోయెంకర్పోన్’’ (గోవాతత్వం)ను, ఇక్కడి చట్టాలను గౌరవించని వారికి గోవాలోకి ప్రవేశం లేదని మనోహర్ అజ్గాన్కర్ తేల్చిచెప్పారు. ఇటీవల గోవాలో మద్యపానంపై విధించిన ఆంక్షలపై మనోహర్ అజ్గాన్కర్ గురువారం ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ మద్యం తాగడం సమస్య కాదు కానీ మద్యం మత్తులో వాళ్లు చేసే వికృత చేష్టలు, వారి దుష్ప్రవర్తనే ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. అందుకే గోవాకు మంచి పర్యాటకులు మాత్రమే రావాలి కానీ ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించని వారు కాదు అని మనోహర్ అజ్గాన్కర్ పునరుద్ఘాటించారు.
 
ఇదిలావుంటే, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించినా, వ్యర్థ పదార్థాలు పడేసినా.. సదరు పర్యాటకులకు చట్టరీత్యా జరిమానా విధిస్తామని గోవా సీఎం మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై అజ్గాన్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారికి రూ.2,500 జరిమానా విధించనున్నట్టు సీఎం మనోహర్ పారికర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Trending News