IND vs AUS: చెపాక్‌లో ఫైనల్ వన్డే.. భారత్‌ను కలవరపెడుతున్న విషయాలు ఇవే..

Team India ODIs Record at Chepauk: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో గెలిచి.. రెండో వన్డేలో ఓడిన భారత్.. మూడో వన్డేకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుండగా.. పాత రికార్డులు టీమిండియాను కంగారు పెడుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 06:56 PM IST
IND vs AUS: చెపాక్‌లో ఫైనల్ వన్డే.. భారత్‌ను కలవరపెడుతున్న విషయాలు ఇవే..

Team India ODIs Record at Chepauk: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ ఆసక్తికరంగా మారింది. తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించగా.. రెండో వన్డేలో ఆసీస్ గెలుపొందింది. అయితే రెండో వన్డేలో భారత్ ఓడిన తీరును అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదట బ్యాటింగ్‌లో విఫలమవ్వగా.. ఆ తరువాత బౌలింగ్‌లోనూ పూర్తిగా చేతులెత్తేశారు. ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. 10 వికెట్ల తేడా జయకేతనం ఎగురువేసింది. సిరీస్‌లో కీలకమైన చివరి వన్డే బుధవారం చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఇరు జట్ల గత గణాంకాలను పరిశీలిస్తే.. కంగారూ జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది.

టీమిండియా చెపాక్‌లో ఇప్పటివరకు 13 వన్డేలు ఆడగా.. అందులో 7 గెలిచి.. ఐదింటిలో ఓడింది. ఒక మ్యాచ్ పూర్తిగా జరగలేదు. ఈ మైదానంలో భారత్ గెలుపు శాతం 58.33గా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కంగారూ జట్టు 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక్కడ ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా గెలుపు శాతం 80గా ఉంది. ఆస్ట్రేలియా ఇక్కడ భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, న్యూజిలాండ్‌ జట్లను ఓడించింది.

భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డేల్లో రెండుసార్లు ఈ స్టేడియంలో తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా తొలిసారి విజయం సాధించగా, భారత జట్టు రెండోసారి గెలుపొందింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ 1987 అక్టోబర్‌లో జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక పరుగుతో భారత్‌ను ఆస్ట్రేలియా  ఓడించింది. 30 ఏళ్ల తర్వాత 2017 సెప్టెంబర్‌లో ఈ రెండు జట్లు తలపడగా.. టీమిడియా 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈసారి ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి మరి.

పిచ్ ఎలా ఉంటుంది..?

ఎంఏ చిదంబరం స్టేడియంలోని పిచ్ సాధారణంగా షార్ట్ ఫామ్ క్రికెట్‌లో స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు సమానంగా సహకరిస్తుంది. రేపటి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు ఇక్కడ మంచి స్వింగ్‌తోపాటు సీమ్ మూవ్‌మెంట్ పొందవచ్చు. ఈ వేదికపై ఆడిన 31 మ్యాచ్‌ల్లో 15సార్లు టాస్ గెలిచిన జట్లు మొదట బ్యాటింగ్‌ చేశాయి. ఛేజింగ్‌లో జట్టు అదే సంఖ్యలో గెలిచింది. ఈ గణాంకాల ప్రకారం.. టాస్ పెద్దగా పట్టింపు లేదు.

Also Read: Aadhar PAN Link: సమయం లేదు మిత్రమా.. 10 రోజుల్లో ఈ పనిచేయకపోతే పాన్ కార్డు చెత్త బుట్టలో వేయండి  

Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News