Old Pension Scheme Protest in Telangana: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులు చేయనుంది. ఉద్యోగుల ప్రయోజనాలను మెరుగు పరిచే విధంగా నిబంధనలు రూపొందించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోకి వచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగస్టులో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే అక్టోబర్ 1న ప్రతిపాదిత అఖిల భారత ర్యాలీలో పాల్గొంటామని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ, కోశాధికారి నరేష్‌గారు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీకాంత్‌తోపాటు మొత్తం 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ సమాశానికి హాజరయ్యారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో మార్పుల కోసం కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ప్రకటనను వారు ఖండించారు.
రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. స్టాక్ మార్కెట్లతో ముడిపడి ఉన్న సీపీఎస్ ప్రమాదకర పథకమని అన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగులకు లేదా వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక భద్రత కల్పించడం లేదన్నారు. సీపీఎస్ కార్పొరేట్ సంస్థలకు ధన ప్రవాహాన్ని అందించే సాధనంగా మారిందని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ సీపీఎస్‌కు ఉద్యోగుల విరాళాలను దాదాపు రూ.20 వేల కోట్లను స్టాక్ మార్కెట్‌లకు పంపిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను 20 వేల కోట్లను రద్దు చేస్తే.. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.
పాత పెన్షన్ విధానం కోసం పెన్షన్ మార్చ్‌తో పాటు.. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనూ నిరసనలకు పిలుపునిచ్చారు టీఎస్‌సీపీఎస్‌ఈయూ నాయకులు. ఏప్రిల్ 16న 33 జిల్లా కేంద్రాల్లో 'పెన్షన్ మార్చ్', జూన్‌లో 'ఓపీఎస్ సంకల్ప్ బస్ యాత్ర' చేపట్టాలని నిర్ణయించారు.
Also Read: YSRCP: వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. సీఎం జగన్ సీరియస్.. సజ్జలకు చెక్..?
Also Read: IPL 2023: రూమ్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ డైలాగ్స్‌తో సెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి