Hair Re-growth Foods: జుట్టుకు ప్రొటీన్ చాలా ముఖ్యం. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలో కూడా అడ్డంకులు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు, ఎలాంటి ఆహారాలు తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పెరగాలంటే రోజూ వీటిని తినండి:
గుడ్లు:
గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు పొడవుగా, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వెంట్రుకల స్కాల్ప్ మెరుగుపర్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రోజూ 2 గుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతుంది.
పాలకూర:
బచ్చలికూరలో ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనితో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజూ తీసుకుంటే జుట్టు బలంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు చిట్లడం వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి. జుట్టు పెరుగుదలను కూడా వేగవంతం చేస్తుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పాలకూరను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Green Tea Face Mask: గ్రీన్ టీ ఫేస్ మాస్క్‌తో ఎలాంటి చర్మ సమస్యలైన సరే 2 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!
డ్రై ఫ్రూట్స్:
జుట్టు పెరుగుదలను పెంచడానికి డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఇందులో అధిక పరిమాణంలో ప్రొటీన్లు ఉంటాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి పని చేస్తుంది. అంతేకాకుండా రోజూ తినడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా, ఆరోగ్యంగా మారుతుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook