Complaint on Balagam Director Venu: బలగం సినిమాతో దర్శకుడిగా మారి హిట్ అందుకున్నాడు కమెడియన్ వేణు. కమెడియన్ వేణుగా సుపరిచితమైన ఆయన ఈ సినిమాతో ఎల్దండి వేణుగా మారిపోయాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా పూర్తిస్థాయి తెలంగాణ నేపథ్యంలో ఆర్టిస్టులతో రూపొందించిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం మూడు నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 40 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
ఓటీటీ సహా శాటిలైట్ రైట్స్ కోసం భారీగానే డబ్బులు వెనక్కి వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ ఈ సినిమాని తెరలు వేసి మరి ప్రదర్శిస్తున్నారు అంటే ఈ సినిమాను చూసేందుకు అందరూ ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి ఈ సినిమా డైరెక్టర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కొందరు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ అయింది.
ఇది కూడా చదవండి: Nani Vs Raviteja: 'రావణాసుర' కలెక్షన్స్ కబ్జా చేస్తున్న దసరా.. డామినేషన్ అంటే ఇదేనేమో?
ఇబ్రహీంపట్నంకి చెందిన ఎంపీటీసీలు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ ను కలిసి ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ బలగం సినిమా తెలంగాణ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్న తరుణంలో ఇలా డిమాండ్ చేయడం బాధగానే ఉందని అంటూనే ఎంపీటీసీలుగా ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడిన సన్నివేశాలు కొన్ని తమను ఎంతగానో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సీన్స్ కోసం మనోభావాలు దెబ్బతింటున్నాయని కాబట్టి బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలు సినిమా నుంచి తొలగించాలని అదే విధంగా ఇలాంటి సీన్స్ పెట్టి తమ మనోభావాలను కించపరిచిన వేణు మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సినిమాలో నారాయణ అనే పాత్రతో వచ్చిన సంభాషణలు నేపథ్యంలో ఈ ఎంపీటీసీ అనే పదవి గురించి ప్రస్తావన వస్తుంది. అప్పుడే తమను కించపరిచే విధంగా మాటలు మాట్లాడారు అంటూ ఎంపీటీసీలు ఇప్పుడు వినతి పత్రం అందించడం హాట్ టాపిక్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Mogilaiah health: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. అత్యంత విషమంగా పరిస్థితి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook