Balakrishna: కేంద్రం బ్యాన్ చేసిన బాలయ్య ఈ సినిమా తెలుసా..

Balakrishna: ప్రస్తుతం ఏదైనా సినిమా ఒకరి మనోభావాలను దెబ్బ తీసేలా తెరకెక్కిస్తే.. ఆయా సినిమాలను కేంద్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉండే రాష్ట్రాలు బ్యాన్ చేసిన సందర్బాలున్నాయి. ఇక అప్పట్లో బాలకృష్ణ నటించిన ఓ సినిమాను బ్యాన్ చేసారు. ఆ సినిమా ఏమిటంటే.. ?

1 /6

నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే.. ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తండ్రిబాటలో హీరోగా ఇప్పటికీ సత్తా చూపిస్తూనే ఉన్నాడు.

2 /6

అంతేకాదు ఒక నట వారసుడిగా అడుగుపెట్టి ఇప్పటికీ హీరోగా కంటిన్యూ అవుతున్న వారు ఎవరు లేరు. ఆగష్టు 29తో నటుడిగా బాలయ్య 50 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర సీమ ఆయన్ని ఘనంగా సత్కరించాలనే ప్లాన్ చేసింది.

3 /6

ఈ సందర్భంగా బాలయ్య నటుడిగా పరిచయమైన చిత్రం ‘తాతమ్మ కల’. ఎన్టీఆర్ నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో కేంద్రం బ్యాన్ చేసింది. ఈ సినిమాలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణతో పాటు భూ గరిష్ఠ చట్టాన్ని వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత బ్యాన్ విధించింది.

4 /6

ఈ విషయమై ఎన్టీఆర్ కోర్టు కెక్కారు. అంతేకాదు ప్రభుత్వం చెప్పినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ 1975 సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. ఈ న్యూ వెర్షన్ లో ఓ కలర్ పాటను యాడ్ చేసారు. అంతేకాదు క్లైమాక్స్ లో ముసలవ్వ భర్త పాత్రగా ముసలి ఎన్టీఆర్ పాత్రను యాడ్ చేసారు.

5 /6

ఒక రకంగా ఈ సినిమా మొత్తం భానుమతి పాత్రపై నే నడుస్తోంది. ఆమె కలను నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం. ఈ సినిమాలో హరికృష్ణ కూడా బాలయ్య అన్న పాత్రలో నటించారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ కలిసి నటించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ భానుమతి భర్తగా.. మనవడిగా ద్విపాత్రాభినయం చేసారు.

6 /6

ఆ తర్వాత ఎన్టీఆర్, బాలయ్యలు నటించిన ‘శ్రీ మద్విరాట పర్వం’ సినిమా కూడా ఇదే రూట్లో సెన్సార్ కత్తెరకు గురైంది. ఆ తర్వాత అన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం విడుదలైంది.