EPFO Account: PF ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్.. సింగిల్ మిస్డ్ కాల్‌తో మీ ఖాతాలో వడ్డీ, పూర్తి బ్యాలెన్స్ వివరాలు పొందండి..


EPFO Account: ఇకనుంచి మీ అకౌంట్లో డబ్బులు ఎంత జమ ఉన్నాయో.. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యాడ్ చేసే వడ్డీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సింగిల్ క్లిక్ తో తెలుసుకోవచ్చు. ఇలా ఈ క్రింది నెంబర్ కి కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి పూర్తి వివరాలు తెలుసుకోండి.

EPFO Account: ఉద్యోగులు అంటేనే బిజీ బిజీ ఉంటారు.. వారికి ఇతర పర్సనల్ పనులు చేసుకోవడం కష్టమే.. ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడే చాలామంది వ్యక్తిగత పనులను చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాల బిజీలో పడిపోయి.. చాలామంది వారికి సంబంధించిన పీఎఫ్ అకౌంట్ గురించి మర్చిపోతున్నారు. కొంతమంది అయితే ఖాతా ఓపెన్ చేసి మరో ఐదు సంవత్సరాల తర్వాత రీ ఓపెన్ చేస్తున్నారు. ఇంతకీ అందులో వడ్డీ జమ జమవుతుందా? లేదా అని చాలామంది సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు..
 

1 /8

ప్రతినెల మనకు వచ్చే జీతం నుంచి పీఎఫ్ కట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. కానీ కొంతమందికి వారి పీఎఫ్ అకౌంట్లోకి కట్ అయిన బ్యాలెన్స్ ఇతర కారణాలవల్ల జమ కాకుండా ఉంటుంది. ప్రతి నెల మనం ఉద్యోగం చేసే కంపెనీ పీఎఫ్ అకౌంట్లో 12 శాతం కు పైగా జమ చేస్తుంది.   

2 /8

ఇలా జమ చేసిన 12 శాతం అందులో మూడు శాతం పిఎఫ్ అకౌంట్‌లోకి వెళితే మిగిలిన 8 శాతం మాత్రం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలోకి (EPF) వెళ్తుందని కొంతమందికే తెలుసు.. దీని ద్వారా వయస్సు మళ్ళీ నప్పుడు కంపెనీ నుంచి రిటైర్డ్ అయినప్పుడు దీనిని పెన్షన్ లాగా పొందవచ్చు.   

3 /8

ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం తర్వాత కొంత మొత్తంలో వడ్డీని కూడా జమ చేస్తూ వస్తోంది. దీనివల్ల ఖాతాదారుడికి ఒకటి నుంచి రెండు శాతం వరకు వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలా జమ చేస్తే వడ్డీని కేంద్రం సరైన సమయంలో మీ అకౌంట్ కి పంపుతుందా? కంపెనీలు కూడా సరైన మోతాదులో పిఎఫ్ కట్ చేస్తున్నారా? వంటి వివరాలను సింగిల్ క్లిక్ తో తెలుసుకోవచ్చు.   

4 /8

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినప్పటి నుంచి ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో కొత్త కొత్త టెక్నాలజీతో ప్రత్యేకమైన ఆప్షన్స్ తీసుకువస్తుంది. అయితే ఇందులో భాగంగా EPF వ్యవస్థలో కూడా ప్రత్యేక మార్పులని తీసుకువచ్చింది. ఇకనుంచి మీ పిఎఫ్ అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయో లేదో.. అలాగే వడ్డీ పెరిగిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.

5 /8

కేంద్ర ప్రభుత్వం అందించిన నిబంధనల ప్రకారం.. ప్రతి ఒక్క పీఎఫ్ ఖాతాదారుడికి యూఏఎన్ నెంబర్ కచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా పీఎఫ్ అకౌంట్ కు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా లింకై ఉంటుంది. మీరు ఖాతా ఓపెన్ చేసినప్పుడు వీటికి టెక్స్ట్ మెసేజ్ లు వస్తాయి. 

6 /8

అలాగే PF అకౌంట్‌కి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ పాన్, కార్డ్ ని లింక్ చేసి ఉండాలి. ఇలా అన్నీ లింక్ ఉంటేనే PF అకౌంట్ సక్రమంగా పనిచేస్తుంది. ఇలా అన్నీ లింకు చేసుకున్న ఖాతాదారులు ఎంతో సులభంగా వారి ఖాతాలో బ్యాలెన్స్ను తెలుసుకోవచ్చు.   

7 /8

కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. సులభంగా PF ఖాతాలో జమైన వడ్డీని, బ్యాలెన్స్ వివరాలను 9966044425 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నెంబర్ను మొబైల్ లో డయల్ చేసి కేవలం మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. 

8 /8

నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల నేరుగా మీ మెసేజ్ ఇన్బాక్స్‌కి PF అకౌంట్లో జమై ఉన్న పొదుపు వివరాలు, వడ్డీ వివరాలు కేవలం 10 నిమిషాల్లోనే మీకు చేరుతుంది. అయితే ఈ ఆప్షన్ కేవలం మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్న అకౌంట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతోంది.