Gold Price In Hyderabad 22 June 2021: బంగారం ధర వరుసగా పదోరోజు పతనం, పుంజుకున్న వెండి ధరలు

దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలు, లాక్‌డౌన్ వేళలలో సడలింపులు చేస్తున్నా బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. గత 10 రోజులుగా ఏపీ, తెలంగాణలో బంగారం ధర తగ్గుతోంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. 

Gold Rate Update 22 June 2021: దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలు, లాక్‌డౌన్ వేళలలో సడలింపులు చేస్తున్నా బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. గత 10 రోజులుగా ఏపీ, తెలంగాణలో బంగారం ధర తగ్గుతోంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. 

1 /4

Gold Rate Update 22 June 2021: దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలు, లాక్‌డౌన్ వేళలలో సడలింపులు చేస్తున్నా బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. గత 10 రోజులుగా ఏపీ, తెలంగాణలో బంగారం ధర తగ్గుతోంది. ఢిల్లీలోనూ బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. దేశ రాజధానిలో వెండి ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ స్వల్పంగా ధర పెరిగింది. Also Read: WhatsApp Stickers: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, త్వరలోనే సరికొత్త ఫీచర్

2 /4

Gold Price Today In Hyderabad: కరోనా కేసులు తగ్గుతున్నా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం ధరలు క్షీణించాయి. తాజాగా రూ.110 మేర దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.47,880కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సైతం రూ.43,890కి పతనమైంది. Also Read: BSNL Recharge Plan: జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్, 105GB అధికం

3 /4

దేశ రాజధానిలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత పదిరోజుల నుంచి బులియన్ మార్కెట్‌లో ధరలు క్షీణిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో రూ.40 మేర స్వల్పంగా ధర దిగొచ్చింది. నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,290కి పతనమైంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100కు క్షీణించింది.

4 /4

దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల అనంతరం వెండి ధరలు పుంజుకున్నాయి. రూ.200 మేర స్వల్పంగా పెరగడంతో 1 కేజీ వెండి రూ.67,800కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధర పెరిగింది. నేడు రూ.300 మేర స్వల్పంగా పెరగడంతో హైదరాబాద్, విజయవాడలలో 1 కేజీ వెండి ధర రూ.73,400 అయింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook