Gold Rate Update 10 February 2021: బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.
బులియన్ మార్కెట్లో ఫిబ్రవరి తొలి వారంలో తగ్గిన బంగారం ధరలు, వెండి ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నేడు రూ.640 మేర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,710 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,650కి చేరింది. Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు నేడు రూ.650 మేర భారీగా పెరిగాయి. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,050 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగడంతో ధర రూ.46,800కి చేరింది. Also Read: Credit Cards: క్రెడిట్ కార్డు బిల్లులను EMI రూపంలో చెల్లిస్తే మీకు 5 ప్రయోజనాలు
ఢిల్లీలో ఫిబ్రవరి తొలి వారంలో తగ్గిన వెండి ధర తాజాగా భారీగా పెరిగింది. వెండి ధర రూ.1,000 మేర భారీగా పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.70,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.2,100 మేర భారీగా పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.75,200కు చేరింది.