HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఎవరికీ తెలియని ఈ నిజాలు తెలుసా..

HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి గత 50 యేళ్లుగా టాప్ హీరోగా అలరిస్తున్నాడు. ఈయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్..మరెన్నో ఫ్లాపులున్నాయి. అయినా విజయానికి పొంగిపోకుండా.. అపజయానికి కృంగిపోకుండా  తన పని చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఎమ్మెల్యేగా.. బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఏంటో తెలుసుకుందాం..

1 /12

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నట సింహం గురించి ఎవరి తెలియని నిజాలు..

2 /12

నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవ తారకం దంపతులకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఎన్టీఆర్ దంపతులకు ఆరో కుమారుడు.

3 /12

14 యేళ్ల చిన్న వయసులో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘తాతమ్మ కల’ మూవీతో నటుడిగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగకుండా నటుడిగా ఎక్కువగా టైటిల్ రోల్స్ చేయడం విశేషం తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.  

4 /12

50 యేళ్ల నట ప్రస్థానంలో జానపద, పౌరాణిక, చారిత్రక, సోషల్, సోషియో ఫాంటసీ, టైమ్ ఫిక్షన్స్ సినిమాల్లో నటించిన నందమూరి బాలయ్య. తన తరంలో అన్ని జానర్స్ లో చిత్రాలు చేసిన ఏకైక హీరోగా రికార్డు.

5 /12

బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాద్ లో గడిచింది. తండ్రి కోరిక మేరకు నిజాం కాలేజిలో డిగ్రీ పూర్తి చేసారు.

6 /12

సోలో హీరోగా మొదటి చిత్రం ‘సాహసమే జీవితం’. హీరోగా తొలి సక్సెస్ అందుకున్న చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’.    

7 /12

దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటించారు.

8 /12

హీరోగా విజయశాంతితో ఎక్కువ చిత్రాల్లో నటించిన నందమూరి బాలకృష్ణ.

9 /12

ఒకే రోజు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు వంటి చిత్రాలను రిలీజ్ చేసిన బాలయ్య..

10 /12

తాతమ్మ కల నుంచి మహారథి వరకు మొత్తం 10 సినిమాల్లో తన సొంత పేరు బాలకృష్ణతో నటించడం విశేషం.

11 /12

రాముడు భీముడు, ఆదిత్య 369 నుంచి వీరసింహా రెడ్డి వరకు  తన తరంలో 18 చిత్రాల్లో ఎక్కువ డ్యూయల్ రోల్స్ పోషించిన బాలకృష్ణ.

12 /12

ఎమ్మెల్యేగా మూడు సార్లు హిందూపుర్ నుంచి టీడీపీ తరుపున గెలిచారు.