Investment: మీ భార్య పేరు మీద ఈ స్కీములో నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆమె భవిష్యత్తు బంగారుమయం

Investment Tips: కొత్త ఏడాది కానుకగా మీ భార్య పేరు మీద ఈ స్కీములు పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సంపద కూడబెట్టవచ్చు. ఆ స్కీము ఏదో ఇప్పుడు చూద్దాం. 
 

1 /7

Investment Tips: చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ వయస్సులో ఏం పని చేద్దామనుకున్నా వయస్సు దానికి సహకరించదు. కాబట్టి వయస్సు ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తుంటే వయస్సు మీద పడిన తర్వాత సంతోషంగా ఉండవచ్చు. అందుకు రిటైర్మెంట్ ముందు నుంచే సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా అలాంటి ఇన్వెస్ట్ స్కీమ్ కోసం సెర్చ్ చేస్తుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంతో మీ భార్య పేరు మీద కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టుకోవచ్చు.   

2 /7

ఎన్పీఎస్ ఫీచర్లు  నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. దీనిలో రెండు ప్రధాన దశలు ఉంటాయి. ఇందులో సంపద కూడబెట్టుకోవచ్చు. విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు 18ఏళ్ల వయస్సు నుంచి 75ఏళ్ల వరకు ఎన్పీఎస్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీకు 60ఏళ్లు వచ్చినప్పుడు మీరు మీ సేవింగ్స్ లో కొంత భాగాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన డబ్బుతో నెలకు పెన్షన్ అందించే యాన్యుటీ ప్లాన్ ను తీసుకోవచ్చు. మీ భార్య పేరు మీద ఎన్పీఎస్ అకౌంట్ తెరిచి ఆమె ఆర్థిక భవిష్యత్తును బంగారు మయం చేయవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా ఉండవచ్చు.   

3 /7

ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు -ఈ స్కీములో మీరు రూ. 1000 నుంచి డిపాజిట్ తో మీ భార్య పేరుమీద ఎన్పీఎస్ అకౌంట్ తీసుకోవచ్చు.   

4 /7

మీరు మీ సౌకర్యాన్ని బట్టి నెలలవారీగా లేదా ఏడాదికోసారి డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. నెలకు రూ,5000చేస్తే ఏడాదికి రూ. 60000వేల పెట్టుబడి పెట్టవచ్చు

5 /7

మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు క్రమంగా పెరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో మంచి  రిటర్న్ అందుతున్నాయి. ఎన్పీఎస్ లో పెట్టుబడులకు సాధారణంగా ఏడాదికి 12శాతం రిటర్న్స్ లభిస్తాయి.   

6 /7

మీ భార్యకు 60ఏళ్లు వచ్చినప్పుడు ఎన్పీఎస్ అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అయితే దాన్ని 65ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో డబ్బులో కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని రెగ్యులర్ పెన్షన్ గా మార్చుకోవచ్చు.   

7 /7

మీరు నెలకు రూ. 5వేల  చొప్పున ఏడాదికి 60వేలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 30ఏళ్లకు రూ. 18,00,000 మీ చేతికి వస్తుంది. అకౌంట్ తీసుకునేందుకు అధికారికి ఎన్పీఎస్ వెబ్ సైట్ లేదా సమీపంలోని పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ను విజియ్ చేయండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.