Sobhita Chaitu Wedding: మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి.. సమంత మీద ఇంకా ఫీలింగ్స్ పోలేదా..?.. చైతుపై నెట్టింట దుమారం..

nagachaitanya insta Samantha post: నాగచైతన్య, శొభిత ధూళిపాళ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైతు మరల కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారినట్లు తెలుస్తొంది.
 

1 /6

ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. తమ అక్కినేని ఇంట పెళ్లి వేడుకను చూసేందుకు అభిమానులు కళ్లలో ఓత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారంట.

2 /6

శోభిత ధూళిపాళ చైతు రేపు అంటే.. డిసెంబర్ 4న పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్న పూర్ణ స్టూడియోను గ్రాండ్ గా ముస్తాబు చేసినట్లు తెలుస్తొంది. అయితే.. వీరిద్దరి పెళ్లి రాత్రి పూట 8  తర్వాత జరుగనున్నట్లు తెలుస్తొంది.  

3 /6

బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం... దాదాపు 8 గంటల క్రతువు ఉండనున్నట్లు తెలుస్తొంది. అయితే.. శోభిత, చైతుల మంగళస్నానాలు ఇటీవల గ్రాండ్ గా అన్న పూర్ణ స్టూడియోస్ లో జరిగింది.  

4 /6

శోభిత పెళ్లి కూతురులా రెడ్ కలర్ సారీలో, ఆభరణాలు ధరించి అచ్చం పుత్తడిబొమ్మలా మెరిసిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు కుటుంబాలు అక్కినేని ఫ్యామిలీ సైతం..వీరి పెళ్లికి ఎంతో ఉత్సహంతో ఎదురుచూస్తున్నాయంట.

5 /6

ఈ నేపథ్యంలో చైతు మరోసారి కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్లు తెలుస్తొంది. చైతు, సమంతా డైవర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరు..కలిసి గతంలో. 2019లో రిలీజ్ అయిన 'మజిలీ' సినిమా ప్రమోషనల్ పోస్టర్ లో వీరిద్దరూ కలిసి కన్పించారు. ఆ ఫోటోను.. ఇంకా చైతు తన ఇన్ స్టాలో డిలీట్ చేయకుండా అలానే ఉంచేశాడంట.  

6 /6

దీనిపై ప్రస్తుతం వివాదం రాజుకున్నట్లు తెలుస్తొంది. నెటిజన్లు మాత్రం చైతు తీరును తప్పుపడుతున్నారంట. ఇంకా ఆ పోస్ట్ అవసరామా అని అంటున్నారంట. ఒక వేళ అది శోభిత కంట పడితే.. మరల ఇద్దరి మధ్యలో గ్యాప్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారంట. దీంతో ఈ నెట్టింట ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.