Nara Lokesh: రాజకీయాల్లో నారా లోకేశ్‌ సంచలనం.. వంగవీటి రాధాకృష్ణకు 'పదవీ యోగం'

Nara Lokesh Vangaveeti Radha Krishna Meet: అధికారంలోకి వచ్చాక నారా లోకేశ్‌ దూకుడుగా వెళ్తున్నారు. రాజకీయంగా పరిణతి చెందుతున్న లోకేశ్‌ పాలనలోనూ తన మార్క్‌ చూయిస్తున్నారు. తాజాగా ఆయన ఓ వ్యక్తిని కలిసి రాజకీయంగా సంచలనం రేపారు. స్వయంగా ఇంటికి వెళ్లి మరి కలవడం ఆసక్తికరంగా మారింది.

1 /7

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అనారోగ్యం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.

2 /7

ఢిల్లీ పర్యటన ముగించుకున్న నారా లోకేశ్‌ విజయవాడ చేరుకుని నేరుగా రాధాకృష్ణ నివాసానికి వెళ్లారు.

3 /7

తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

4 /7

ఈ సందర్భంగా రాధాకృష్ణ కుటుంబసభ్యులతో లోకేశ్‌ మాట్లాడి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ గడిపారు.

5 /7

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అవకాశం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు రాధాకృష్ణకు ప్రాధాన్యం ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక ఆయనకు గౌరవం ఉంటుందని ప్రకటించారు.

6 /7

టీడీపీని వీడుతారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.

7 /7

వంగవీటి  రాధాకృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. వీరి భేటీలో వంగవీటి రాధాకృష్ణకు పదవి ఇచ్చే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.