Hidni Dubbed South movies top Collections: సౌత్ డబ్బింగ్ మూవీస్ లో పుష్ప 2 సంచలనం.. ‘బాహుబలి 2’ను వెనక్కి నెట్టిన పుష్ప రాజ్..

Hidni Dubbed South movies top  Collections: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం  ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.  అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలైన  హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. తొలి రోజు వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఈ రోజు బాహుబలి 2 ను దాటి పోయింది.

1 /6

Hidni Dubbed South movies top Collections: తెలుగు సహా పలు దక్షిణాది డబ్బింగ్ చిత్రాలు హిందీ బాక్సాఫీస్ ను శాసిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, కన్నడ చిత్రాలు హిందీ చిత్రాలను డామినేట్ చేస్తున్నాయి. బాహుబలి సహా మిగతా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలాయి. తాజాగా పుష్ప 2 చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. మొత్తంగా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల విషయానికొస్తే..

2 /6

1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో  తెరకెక్కిన భారీ చిత్రం  ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా  హిందీలో ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాల్లో  మొదటి రోజే మన దేశంలో  రూ.72 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1లో నిలిచింది. తాజాగా నిన్నటి వసూల్లతో ఈ సినిమా హిందీలో బాహుబలి 2 లైఫ్ టైమ్ వసూళ్లైన రూ. 511 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేసి రూ. 550 కోట్లకు అటు ఇటు నెట్ వసూల్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. అంతేకాదు పుష్ప 2 హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలు ఈ రోజు వసూల్లతో సాధించే అవకాశాలున్నాయి.

3 /6

2.బాహుబలి 2..  రాజమౌళి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా అప్పటి వరకు బాలీవుడ్ లో డబ్బైన చిత్రాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో  మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు హిందీ చిత్ర సీమలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. దాదాపు 7 యేళ్ల క్రితమే ఈ మూవీ ఫస్ట్ డే రూ. 41 కోట్ల వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 511 కోట్ల నెట్ వసూళ్లతో సౌత్ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ లో ఉంది. తాజాగా పుష్ప 2 సినిమా ఆదివారం వసూళ్లతో ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయడంతో సౌత్ డబ్బింగ్  మూవీల్లో ఎక్కువ వసూళ్లు సాధించి చిత్రాల్లో టాప్ 1 స్థానం నుంచి టాప్ 2 లో నిలిచింది.

4 /6

3.కేజీఎఫ్ 2 - KGF 2.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా   తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2’ మూవీ .. హిందీ బాక్సాఫీస్ దగ్గర విడుదలైన  డబ్బింగ్ సినిమాల్లో మొదటి రోజు  మన దేశంలో రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో రూ. 435.2 నెట్ వసూళ్లతో టాప్ 2 నుంచి పుష్ప 2 రాకతో టాప్ 3లోకి జారుకుంది.

5 /6

4. కల్కి 2898 AD.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 294.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి టాప్ 4లో ఉంది.

6 /6

5.RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్  హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో  రూ.276.8 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.