Funny Viral Video: ఓరిమీ కరువు పాడుగాను.. బర్త్ డే కేక్ కట్ చేయకముందే మొత్తం తినేసిన కుర్రాళ్లు!

Birthday Cake Funny Viral Video goes Viral. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బర్త్ డే జరుపుకునే అబ్బాయి కేక్ కట్ చేయకముందే అతని స్నేహితులు మొత్తం తినేశారు.  

Written by - P Sampath Kumar | Last Updated : May 25, 2023, 09:46 PM IST
Funny Viral Video: ఓరిమీ కరువు పాడుగాను.. బర్త్ డే కేక్ కట్ చేయకముందే మొత్తం తినేసిన కుర్రాళ్లు!

Birthday Cake Funny Viral Video: సోషల్ మీడియా ప్రపంచం ఫన్నీ వీడియోలతో నిండిపోయింది. ప్రతిరోజూ ఎన్నో ఫన్నీ వీడియోలు నెట్టింట అప్‌లోడ్ అవుతుంటాయి. అవి జనాలకు బాగా నచ్చుతాయి. వాటిలో కొన్ని మాత్రం చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. అవి చూసిన వారు నవ్వు ఆపుకోలేరు. కొందరు మనసారా నవ్వుకుంటే.. మరికొందరు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో పుట్టినరోజు కేక్‌కు సంబంధించింది. బర్త్ డే జరుపుకునే అబ్బాయి కేక్ కట్ చేయకముందే అతని స్నేహితులు మొత్తం తినేశారు. 

వైరల్ వీడియో ప్రకారం... ఓ అబ్బాయి తన పుట్టినరోజును జరుపుకోవడానికి తన స్నేహితులను ఆహ్వానించాడు. పుట్టినరోజు చేసుకునే అబ్బాయి కుర్చీపై కూర్చుని ఉండగా.. ఒక పెద్ద కేక్ అతడి ముందున్న టేబుల్ మీద ఉంటుంది. ఆ అబ్బాయి స్నేహితులు అందరూ టేబుల్ చుట్టూ గుంపుగా ఉంటారు. కేక్ పైన కొవ్వొత్తి వెలిగించి ఉంటుంది. పుట్టినరోజు జరుపుకుంటున్న అబ్బాయి కొవ్వొత్తిని ఆర్పి.. కేక్ కట్ చేసే లోపు అతడి స్నేహితులు కేక్‌పై విరుచుకుపడుతారు. దాంతో ఒక సెకనులో కేక్ మొత్తం ఖాళీ అవుతుంది. 

స్నేహితులు కేక్‌ను తినేయడంతో బర్త్ డే బాయ్ చేతిలో కత్తి మాత్రమే మిగులుతుంది. అతడి ముందు కేక్ ముక్క కూడా ఉండదు. ఓ అబ్బాయి అయితే ఏకంగా కేక్ ప్లేట్ కూడా ఎత్తుకెళ్లిపోతాడు. దాంతో బర్త్ డే బాయ్ వారిని చాలా కోపంగా చూస్తాడు. అయినా కూడా వారు కేక్ తింటూనే ఉంటారు. ఇక చేసేది లేక పుట్టినరోజును జరుపుకుంటున్న అబ్బాయి అలా ఉండిపోతాడు. దాంతో వీడియో ఎండ్ అవుతుంది.

కేక్‌ను కట్‌ చేయకముందే లాక్కొని తిన్న ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను 'బటర్‌ఫ్లై__మహి' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కూడా షేర్ చేయబడింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 'పుట్టినరోజున ఇలాంటి వారిని పిలిచినందుకు తగిన శాస్త్రి జరిగింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఓరిమీ కరువు పాడుగాను' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 

Also Read: GT vs MI Qualifier 2 Dream11: గుజరాత్-ముంబై మధ్య ఫైనల్ ఫైట్..డ్రీమ్11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్  

Also Read: Raashii Khanna Hot Pics: స్విమింగ్ పూల్‌లో రాశి ఖన్నా.. హాట్ సమ్మర్‌లో హీటేక్కిస్తున్న ఏంజిల్ అరుణ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

 

More Stories

Trending News