CCTV video: రాత్రికి రాత్రే సిటీలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. భయం గుప్పిట్లో జనం

CCTV Viral Video Elephant Herd Enters in City: రాత్రిపూట ఒక అడవి ఏనుగుల గుంపు ఎంట్రీ అందరినీ హడలెత్తించింది. ఏనుగులన్నీ నివాస ప్రాంతాలలోకి రావడంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 06:26 PM IST
  • రాత్రికి రాత్రే సిటీలోకి ఏనుగుల గుంపు
  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • ఏనుగుల గుంపు ఎంట్రీతో హడలెత్తిపోతున్న పట్టణవాసులు
CCTV video: రాత్రికి రాత్రే సిటీలోకి వచ్చిన ఏనుగుల గుంపు.. భయం గుప్పిట్లో జనం

Viral Video Elephant Herd Enters in City At Night Watch: రాత్రికి రాత్రే ఒక ఏనుగుల గుంపు సిటీలోకి వచ్చింది.తమిళనాడులోని (Tamil Nadu) కోయంబత్తూరులో (Coimbatore) రాత్రిపూట ఏనుగుల గుంపు ఎంట్రీ అందరినీ హడలెత్తించింది. ఏనుగులన్నీ (elephants) నివాస ప్రాంతాలలోకి రావడంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. ప్రజలంతా భయాందోళనలకు గురి అవుతున్నారు. రాత్రి పూట జనాలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు (Forest Department) సూచిస్తున్నారు.

అది బుధవారం. డిసెంబర్ 22వ తేదీ. సమయం రాత్రి 7.30 గంటలు.. ఏడు ఏనుగులు వాడవల్లి ప్రాంతంలోని ఐఓబీ కాలనీలోకి ప్రవేశించాయి.సాధారణంగా అడవి నుంచి అప్పడప్పుడు పట్టణంలో ఏనుగులు వస్తుంటాయి. దాదాపుగా అర్ధరాత్రి దాటాకా అవి వస్తుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఏనుగులు సాయంత్రమే వచ్చేశాయి. ఇక ఏనుగులు నగరంలోకి ప్రవేశించిన వీడియో మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్‌ (CCTV footage) అయ్యింది. తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ (Viral) కావడంతో కోయంబత్తూరు జనాలంతా ఆందోళన చెందుతున్నారు. 

Also Read : KL Rahul: రహానే లేదా విహారి.. 5వ స్థానంలో ఎవరు ఆడతారు? కేఎల్‌ రాహుల్‌ ఏం చెప్పాడంటే?

దయజేసి రోజూ రాత్రి పూట గస్తీ నిర్వహించండి అంటూ.. ఏనుగులు పట్టణంలోకి రాకుండా చూడాలంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్లు చేస్తున్నారు కోయంబత్తూరు (Coimbatore) వాసులు. అయితే ఏనుగులు పట్టణంలోకి ప్రవేశిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, పెద్ద శబ్దాలు చేస్తూ వాటిని వెంబడించడం చేయొద్దంటూ అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు. ప్రజలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. మీరు శబ్దాలు చేస్తూ ఏనుగులను తరిమే ప్రయత్నం చేస్తే వాటికి కోపం వచ్చి బీభత్సం సృష్టిస్తాయి అని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో కోయంబత్తూరు వాసులు కూడా ఏనుగులు (Elephants) వచ్చిన సమయంలో సైలెంట్‌ అయిపోతున్నారు.

 

Also Read : Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News