Chimpanzee Sits on a Rope and Eating Bananas Like a King: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జంతువులు, పక్షులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు భయాందోళనకు గురిచేస్తే.. మరికొన్ని హృదయాలకు హత్తుకుపోతాయి. మరికొన్ని వీడియోలు అయితే నవ్వులు పూయిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరికీ నవ్వులు తెప్పిస్తుంది. ఆ వీడియోను ఎవరు చూసినా వావ్ అనక మానరు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ చింపాంజీ కళ్లకు గ్లాస్, చెవిలో పూలు పెట్టుకుని.. అచ్చు మహారాజు లాగ ఓ తాడుపై కూర్చుంటుంది. చింపాంజీ తన చేతిలో అరటి పండ్ల గుత్తిని పట్టుకుని తాడుపై రిలాక్స్‌డ్ పొజిషన్‌లో కూర్చుంటుంది. అచ్చం సోఫాలో కూర్చున్న మాదిరిగానే కూర్చుని.. అరటి పండ్లను తింటుంది. సింగల్ తాడుపై ఉన్నా.. ఎలాంటి బెరుకు లేకుండా పద్దతిగా అరటి పండ్లను తింటుంది.
He knows how to enjoy life! 💕🤣🤣pic.twitter.com/JUpv2sb8gC
— Figen (@TheFigen) July 25, 2022
ఈ వీడియోను ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. 'జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో దానికి బాగా తెలుసు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చింపాంజీ వీడియోకు 3 మిలియన్ల వ్యూస్ మరియు 14,000లకు పైగా రీట్వీట్‌లు వచ్చాయి. అదే సమయంలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'జీవితం అంటే ఇలా ఉండాలి' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. 'లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తుంది' నాయి ఇంకో నెటిజన్ ట్వీటాడు. మీరు చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: సూర్య, శార్దూల్ ఔట్.. ఇషాన్‌కు చోటు! భారత్ తుది జట్టు, డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే
Also Read: Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి చిక్కులు.. నిలిపివేయాలంటూ బీజేపీ ధర్నా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.