Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి చిక్కులు.. నిలిపివేయాలంటూ బీజేపీ ధర్నా!

BJP Corporator Srivani Stops Ram Charan Shankar Movie Shooting: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్  ఒక అనాధాశ్రయములో జరుగుతుండగా స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గౌడ్ అడ్డుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 05:04 PM IST
  • సరూర్ నగర్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్
  • అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్
Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి చిక్కులు.. నిలిపివేయాలంటూ బీజేపీ ధర్నా!

BJP Corporator Srivani Stops Ram Charan Shankar Movie Shooting: రామ్ చరణ్ హీరోగా  ఆయన 15వ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ సరూర్నగర్ లోని వీఎం హోమ్ అనే ఒక అనాధాశ్రయములో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడి స్థానిక బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గౌడ్ అడ్డుకున్నారు.

విద్యార్థుల తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతి ఎలా ఇస్తారు అంటూ ఆమె షూటింగ్ ని అడ్డుకున్నట్టు సమాచారం. తెలంగాణ విద్యాశాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయిన సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థులు జీవితాన్ని పణంగా పెట్టి సినిమా షూటింగ్ కు అనుమతి ఇచ్చారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అలాగే నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మరచిన విద్యాశాఖ మంత్రి షూటింగుల పేర్లతో ఖజానాలను నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుందని ఆమె ఆరోపించారు.

వెంటనే రామచరణ్ సినిమా షూటింగ్ ఆపు చేయాలంటూ ఆమె బీజేపీ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. కేవలం సినిమా షూటింగ్ లో కలర్ సరిగ్గా పడడం లేదని నాలుగు కోట్లతో మరమ్మత్తులు చేయిస్తున్నరాని ఆమె ఆరోపించారు. అంతేకాక సినిమా షూటింగ్ కి ఇలా అనుమతిస్తే విద్యార్థులలో ఏకాగ్రత ఉండదని ఏకాగ్రత కోల్పోతారని ఆమె ఆరోపిస్తున్నారు. చదువుకోవడం ఇబ్బందిగా మారుతుందంటూ ఆమె ధర్నాకు దిగారు.

అయితే ప్రస్తుతానికి సినిమా షూటింగ్ నిలిపివేసినట్లు సమాచారం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపాందుతున్న ఈ సినిమాలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, శ్రీకాంత్ వంటి వారి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

Also Read: Allu Arjun: పుష్ప 2 కంటే ముందే సెట్స్ కు బన్నీ.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రాజెక్ట్!

Also Read: Ranveer Singh FIR: న్యూడ్ ఫోటోషూట్‌.. స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News