Crocodile Video: ముసలి దాడి చేస్తే ఏం చేస్తారు, ఆ పార్క్‌లో ఏం జరిగింది, వీడియో వైరల్

Crocodile Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవతూనే ఉంటాయి. ఓ పార్క్‌లో ముసలి దాడి చేసేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ధైర్యాన్ని కీర్తిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2022, 06:25 PM IST
Crocodile Video: ముసలి దాడి చేస్తే ఏం చేస్తారు, ఆ పార్క్‌లో ఏం జరిగింది, వీడియో వైరల్

Crocodile Video: జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవతూనే ఉంటాయి. ఓ పార్క్‌లో ముసలి దాడి చేసేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ధైర్యాన్ని కీర్తిస్తున్నారు.

వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో విస్తరిస్తుంటాయి. ప్రత్యేకించి మొసళ్లు, పులులు, సింహాల వీడియోలైతే మరీనూ. మొసలి నీటిలోనే కాదు..నీటి బయట కూడా శక్తివంతమైన జంతువు. అత్యంత ప్రమాదకరమైంది. అటువంటిదే ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఈ వీడియోలో ఓ ముసలి ఓ వ్యక్తిపై దాడి చేస్తుండటం చూడవచ్చు. కానీ ఆ వ్యక్తి అప్రమత్తమై..ఎదురుదాడికి దిగుతాడు. చేసేది లేక తోకముడిచి పారిపోతుంది. ఈ వీడియో ఇప్పుడు అత్యంత వేగంగా వైరల్ అవుతోంది. ఓ వృద్ధుడు పార్క్‌లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అంతలో అక్కడికి ఓ ప్రమాదకరమైన ముసలి చేరుకుంటుంది. వస్తూనే..భయంకరంగా నోరు తెరిచి ఆ వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ వృద్ధుడు ఏ మాత్రం భయపడడు. అప్రమత్తమై చేతిలో ఉన్న ఫ్రై పాన్‌తో ఆ ముసలి ముఖంపై బాదడం ప్రారంభిస్తాడు. ఒక్కసారిగా ఎదురుదాడి జరగడంతో ఆ దెబ్బలు తట్టుకోలేక తోకముడిచి పారిపోతుంది. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై బాగా వైరల్ అవుతోంది.

సాధారణంగా మనపై ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రమాదకర జంతువేదైనా దాడి చేసినప్పుడు ముందుకు తేరుకోడానికి సమయం పట్టేస్తుంది. భయంతో మైండ్ పనిచేయదు. దాడికి గురైపోతాం. కానీ ఆ వృద్ధుడు మాత్రం చాలా అలర్ట్‌గా ఉన్నాడు. ఏ మాత్రం భయపడకుండా..చేతిలో ఉన్న ఫ్రై పాన్‌తోనే ఎదురుదాడికి దిగుతాడు. ఇప్పటి వరకూ 8.3 మిలియన్ల్ మంది ఈ వీడియోనూ వీక్షించగా..47 వేల మంది రీట్వీట్ చేశారు. 9 వేలమంది క్వోట్ చేశారు. 

Also read: Norway Dance Video: బాలీవుడ్ పాటకు నార్వే కుర్రోళ్ల డ్యాన్స్, ఫిదా అయిపోయిన అక్షయ్, శిల్పాశెట్టి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News