Crocodile video: పంట పొలాల్లో ప్రత్యక్షమైన మొసలి

జిల్లాలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలోని పంటపొలాల్లో ఓ పెద్ద మొసలి ప్రత్యక్షమవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పంట పొలాల వద్ద మొసలి తిరుగుతుండటాన్ని గమనించిన స్థానిక రైతులు జిల్లా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.

Last Updated : Apr 25, 2020, 01:33 AM IST
Crocodile video: పంట పొలాల్లో ప్రత్యక్షమైన మొసలి

వనపర్తి: జిల్లాలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలోని పంటపొలాల్లో ఓ పెద్ద మొసలి ప్రత్యక్షమవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పంట పొలాల వద్ద మొసలి తిరుగుతుండటాన్ని గమనించిన స్థానిక రైతులు జిల్లా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. రైతుల ఇచ్చిన సమాచారం మేరకు శ్రీరంగాపురం చేరుకున్న జిల్లా అటవీశాఖ సిబ్బంది.. చాకచక్యంగా మొసలిని బంధించి తీసుకెళ్లి జూరాల ప్రాజెక్టులో వదిలారు.

 

జూరాల ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారానే ఈ మొసలి పంట పొలాలకు వచ్చి ఉంటుందని.. రిజర్వాయర్లకు సమీప ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుంటాయని అధికారులు తెలిపారు. ఏదేమైనా అటవీ శాఖ సిబ్బంది మొసలి పట్టుకుని వెళ్లిన తర్వాతే రైతులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

Trending News