Viral Video: ప్రమాదకర పాము నుంచి రామ చిలుకను కాపాడిన కుక్క, వైరల్ అవుతున్న పాము-కుక్క ఫైటింగ్ వీడియో

Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు దిగ్భ్రాంతి కల్గించే వీడియో బాగా వైరల్ అవుతోంది. భయంకరమైన పాముకీ..ఓ కుక్కకీ మద్య జరిగిన పోరాటం వీడియో ఇది. ఆఖరికి ఎవరు గెలిచారు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 2, 2022, 04:46 PM IST
Viral Video: ప్రమాదకర పాము నుంచి రామ చిలుకను కాపాడిన కుక్క, వైరల్ అవుతున్న పాము-కుక్క ఫైటింగ్ వీడియో

కుక్కను నమ్మకానికి ప్రతిరూపంగా భావిస్తారు. కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదని అందుకే అంటారు. ఈ వీడియోలో ఫ్రెండ్‌ని కాపాడేందుకు కుక్క..ఓ ప్రమాదకర పాముతో చేసిన పోరాటం స్పష్టంగా ఉంది. చివరికి ఏమైంది..

మీరు ఇప్పటివరకూ పాము చేసే దాడులు, లేదా మరో జంతువును చంపడం వంటి వీడియోలా చాలానే చూసుంటారు. కానీ బహుశా ఓ కుక్క..ప్రమాదకర పాముపై దాడికి దిగడం చూసుండరు. ఈ వినూత్నమైన వీడియో బహుశా అందులో వైరల్ అవుతోంది. పెద్దఎత్తున కామెంట్లు కూడా వస్తున్నాయి. 

రామచిలుకపై దాడికి దిగిన పాము

ఈ వీడియోలో ఓ ప్రమాదకరమైన పాము పక్షుల పంజరంలో ప్రవేశించింది. అందులో ఉన్న రామచిలుక, ఇతర పక్షుల్ని ఎటాక్ చేయబోయింది. అప్పుడే ఆ ఇంటి కుక్క అక్కడికి చేరుకుంది. జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టింది. ఇక తరువాత ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోవల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే.

చిలుకను కాపాడేందుకు పాముపై దాడి చేసిన కుక్క

తన దగ్గరకు వస్తున్న పామును చూసి రామ చిలుక భయపడుతుంది. పాము మరో క్షణంలో రామచిలుకపై దాడి చేస్తుందనగా..కుక్క అలర్ట్ అవుతుంది. ప్రాణాల్ని లెక్కచేయకుండా..పాము తోక పట్టుకుంటుంది. పంజరం నుంచి బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఈలోగా పాము కుక్కను ఎదుర్కొనేందుకు పంజరంలోంచి బయటకు తల పెడుతుంది. అంతే కుక్క ఒక్క ఉదుటున పాము తలను నోట్లో గట్టిగా కర్చి పట్టేసుకుంటుంది. 2-3 సార్లు పాము తలభాగాన్ని కొరుకుతుంది కూడా. పాము విడిపించుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంది. కానీ కుక్క మాత్రం పామును గట్టిగా కర్చిపట్టకుని పంజరం నుంచి కిందకు లాగి..బయటకు ఈడ్చుకెళ్లిపోతుంది. ఈ వీడియో చూస్తే మీక్కూడా ఒళ్లు జలదరిస్తుంది.

Also read: Baba Vanga 2023 Predictions: 2022 కంటే 2023 మరింత డేంజర్‌గా ఉండనుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News