Gas Delivery Boy: జాక్‌పాట్‌ కొట్టిన గ్యాస్‌ డెలివరీ బాయ్‌.. 49తో రూ.కోటిన్నర గెలిచాడు

Dream 11 App Prize Winner: నిన్నటి దాకా అవసరమైన వారికి గ్యాస్‌ సిలిండర్‌ వేస్తూ గడిపిన ఆ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇన్నాళ్లు గ్యాస్‌ డెలివరీ చేసి చాయ్‌ పానీ కోసం డబ్బులు అడిగే ఆ యువకుడు ఇప్పుడు అందనంత స్థాయికి ఎదిగిపోయాడు. సరదాగా ఫోన్‌లో ఆడిన ఆట అతడి జీవితాన్ని మార్చేసింది. ఒక యాప్‌ అతడిని పేదరికం నుంచి ధనవంతుడిని చేసేసింది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 01:51 PM IST
Gas Delivery Boy: జాక్‌పాట్‌ కొట్టిన గ్యాస్‌ డెలివరీ బాయ్‌.. 49తో రూ.కోటిన్నర గెలిచాడు

Gas Delivery Boy Jockpot: ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేసే డెలివరీ బాయ్‌ సరదాగా ఓ గేమింగ్‌ యాప్‌లో ఆడుతున్నాడు. తనకు ఇష్టమైన ఆట ఆడుతుండగా అందులో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆట ఆడాడు. అంతే అతడి సమాధానాలన్ని సరైనవి కావడంతో అతడు కోటీశ్వరుడయ్యాడు. అతడే బిహార్‌కు చెందిన సాదిఖ్‌. అరారియా జిల్లా పటేగనా గ్రామానిక చెందిన సాదిఖ్‌ ఉమారాజ్‌ గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి క్రికెట్‌ అంటే యమ పిచ్చి. ఇదే పిచ్చితో ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌లో జాక్‌పాట్‌ కొట్టేలా చేసింది. 

డ్రీమ్‌-11 యాప్‌తో నిత్యం క్రికెట్‌ ఆడుతుండేవాడు. ఈ క్రమంలోనే జనవరి 14వ తేదీన జరిగిన భారత్‌, అఫ్ఘానిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆట ఆడాడు. దీనికి రూ.49 చెల్లించి ఆట ఆడుతున్నాడు. ఆట ముగిసేసరికి 974.5 పాయింట్లతో సాదిఖ్‌ మొదటి స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో నిలిచిన విజేతకు డ్రీమ్‌-11 యాప్‌ వెంటనే రూ.కోటిన్నర నగదును సాదిఖ్‌ ఖాతాలో జమ చేసింది. విజేతగా నిలవడంతో సాదిఖ్‌ ఆశ్చర్యపోయాడు. తాను కోటిన్నర గెలిచిన విషయాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పగా మొదట నమ్మలేదు. ఆ తర్వాత రుజువు చూపించడంతో అందరూ అవాక్కయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు సాదిఖ్‌ను అభినందిస్తున్నారు. ఈ యాప్‌లో సాదిఖ్‌ తరచూ ఆడుతూ కొద్దోగొప్పో సంపాదిస్తుండేవాడు. కానీ ఒకేసారి అత్యున్నత నగదు కోటిన్నర సంపాదిస్తానని ఏనాడూ అనుకోలేదని సాదిఖ్‌ చెప్పాడు. ఈ డబ్బుతో తమ కష్టాలు తీరుతాయని సాదిఖ్‌ కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాగా, ఈ జాక్‌పాట్‌ తగిలిన విషయంపై సాదిఖ్‌ పని చేసే గ్యాస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జితేంద్ర స్పందించారు. సాదిఖ్‌కు డబ్బులు వచ్చిన విషయం వాస్తవమే. కానీ వచ్చిన నగదు అంతా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించాం. డబ్బులు వృథా చేసుకోకుండా వచ్చిన వడ్డీతో సాదిఖ్‌ కుటుంబం సంతోషంగా ఉంటుందని ఇలా చేశామని జితేంద్ర తెలిపారు. కాగా డ్రీమ్‌-11 యాప్‌ ద్వారా గతంలో కూడా చాలా మంది కోటీశ్వరులయ్యారు.

గతేడాది అక్టోబర్‌ నెలలో ఓ పోలీస్‌ అధికారి కూడా ఈ యాప్‌ ద్వారా కోటీశ్వరుడయ్యాడు. అయితే చట్టపరం కానీ ఆటలు ఆడి నగదు గెలుపొందిన కారణంగా ఆ అధికారిని సస్పెండ్‌ చేయడం గమనార్హం. మహారాష్ట్రలోని పింప్రి చించ్‌వాడ్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్సైగా పని చేసే సోమ్‌నాథ్‌ జెండే ఈ యాప్‌ ద్వారా రూ.కోటిన్నర గెలిచాడు. ఇది జరిగిన కొన్నిరోజులకు ఉన్నతాధికారులు విధుల్లో నుంచి తొలగించారు.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News