Elephants attacks on bulls video viral: సాధారణంగా అడవికి దగ్గరగా ఉండే గ్రామాల్లో తరచుగా క్రూర జంతువులు వస్తుంటాయి. చిరుతలు, పులులు, ఏనుగులు, పాములు, ఎలుగు బంట్లు తరచుగా గ్రామాల్లో ప్రవేశించిన ఘటనలు మనం అనేకం చూస్తుంటాం. ముఖ్యంగా ఏనుగులు ఇటీవల గ్రామాల్లోకి గుంపులుగా ప్రవేశిస్తున్నారు. ఆసమయంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్నారు. దొరికిన వాళ్లను దొరికినట్లు కూడా తమ తొండంతో ఎత్తి పాడేస్తున్నాయి.
సాధారణంగా ఏనుగులు కొన్నిసార్లు మదం పట్టి సంచరిస్తుంటాయంట. అవి గుంపుల నుంచి వేరు పడినప్పుడు లేదా ఆడ తోడు దొరకనప్పుడు చాలా కోపంగా ప్రవర్తిస్తుంటాయంట. ఆ సమయంలో మాత్రం ఎవరు ముందు కన్పిస్తే వాళ్లను ఎత్తిపాడేస్తాయంట. ఈ క్రమంలో ఏనుగుల దాడులకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది . దీనిలో పశువుల తోట్టెలో ఎడ్లు కట్టి వేయబడి ఉన్నాయి.
— Wildlife Uncensored (@TheeDarkCircle) January 5, 2025
మరీ ఆ పశువుల తొట్టే అడవికి దగ్గరగా ఉందో.. మరేంటో కానీ.. దానిలోకి ఏనుగు ప్రవేశించింది. దాన్ని చూసిన వెంటనే.. అక్కడున్న పశువులు భయంతో గట్టిగా అరిచాయి. కానీ రైతు కానీ.. వాటిని చూసుకునే వాళ్లు అక్కడ లేరేమో.. ఆ ఏనుగు పశువుల తొట్టేలోకి ప్రవేశించి.. తన ప్రతాపం ఆవుల మీద చూపించింది. ఒక ఆవు మీద దాడి చేసి.. తొండంతో, కాలితో ఒక కార్నర్ కు నొక్కిపెట్టి మరీ కూర్చుంది.
మరోక ఎద్దు మీద దాడి చేసేందుకు ప్రయత్నించింది. పాపాం.. ఆ మూగ జీవాలు కట్టేసి ఉండటంతో ఎటు వెళ్లలేక.. ఏనుగు టార్చర్ ను భరించక తప్పలేదు.. కానీ కాసేపటికి ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపొవడంతో బ్రతికిపోయామని ఆ పశువులు భావించినట్లు తెలుస్తొంది.
ఈ ఘటన రాత్రి జరిగిందో.. మరేంటో కానీ.. అక్కడున్న సీసీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బోబోయ్.. అంటూ భయపడిపోతున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter