Elephant tradition dance video goes viral: సంగీతానికి రాళ్లను కూడా కరిగించేసే శక్తి ఉంటుందంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా బాధగా ఉన్న.. ఆనందం ఉన్న.. ఏదైన మంచి మ్యూజిక్ పెట్టుకుని వింటుంటారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా అమ్మాయిలు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఏ మాత్రం తమకు అవకాశం దొరికిన కూడా డ్యాన్స్ తో రచ్చ చేస్తుంటారు.
ఈ క్రమంలో ఒక గజరాజు.. ప్రస్తుతం నెట్టింట డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీగా జరిగిన ఏ సంఘటనలైన వెంటనే వైరల్ అవుతుంటాయి. కొన్ని షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు.
— Bhoomika Maheshwari (@sankii_memer) November 26, 2024
నెటిజన్లు సైతం వెరైటీ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు . కొన్ని జంతువులు ఫన్నీగా ప్రవర్తింటాయి. అవి చేసే పనుల్ని చూస్తే మాత్రం తెగ నవ్వొస్తుంటుంది. అంతే కాకుండా.. ఏనుగులు కొన్నిసార్లు ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. కొంత మంది వాటిని ఆడుకుంటుంటారు. అచ్చం.. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం ట్రెండిగ్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఇద్దరమ్మాయిలు.. ఒక చోట మంచి క్లాసికల్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ లు చేస్తున్నారు. పాటకు తగ్గట్టుగా భరత నాట్యం స్టెప్పులు వేస్తున్నారు. అయితే.. వీరు ఉన్న ప్రదేశంలో ఒక ఏనుగు వీరి వెనకాల కట్టేసి ఉంది. అయితే..ఈ పాట, వీరి డ్యాన్స్ ఆ ఏనుగుకు కూడా నచ్చిందో ఏంటో కానీ.. అది కూడా వీరితో పాటు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేసింది.
Read more: Girinagu: అమ్మబాబోయ్.. 12 అడుగుల భారీ గిరినాగు.. కళ్ల ముందే రక్త పింజరను.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
అమ్మాయిలతో పాటు.. తన తొండం, శరీరంను అటు ఇటు కదిలిస్తూ.. భలే స్టెప్పులు వేసింది. ఈ వీడియోను ఫారెస్ట్ అధికారి తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం వావ్.. ఏనుగు భలే స్టెప్పులు వేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.