Famous Hill Stations in India: ఇండియా అంటే ఎన్నో అందమైన ప్రదేశాలకు పెట్టింది పేరు. పర్యాటక ప్రదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మనం ఏ విదేశాలకో వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే మన చుట్టే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆ అందమైన ప్రదేశాల జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం రండి.
షిమ్లా, హిమాచల్ ప్రదేశ్ :
ఇండియాలో షిమ్లా అనే పర్యాటక ప్రదేశాన్ని ఎవ్వరికీ ఎవ్వరూ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియాలో షిమ్లా అంటే అంత పాపులర్. ఏదైనా చల్లటి ప్రదేశంలో ఎంజాయ్ చేసొద్దాం అంటే చాలామందికి కళ్ల ముందు మెదిలే తొలి స్పాట్ షిమ్లానే. షిమ్లాకు "క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్" అనే పేరు కూడా ఉంది. షిమ్లాలో ప్రాచీన కాలం నాటి కట్టడాలు, రోడ్డు పక్కనే షాపింగ్, పానోరమిక్ వ్యూలో హిమాలయాలు చూడవచ్చు. రిడ్జ్ అండ్ క్రీస్తు చర్చిని చూడటం మిస్ కావొద్దు.
కులూ మనాలి, హిమాచల్ ప్రదేశ్ :
కులూ మనాలిని, షిమ్లాను వేర్వేరుగా చూడలేం. రెండూ వేర్వేరు ప్రాంతాలే అయినప్పటికీ.. ఒకే రాష్ట్రం కావడంతో పాటు చల్లటి ప్రదేశాలుగా పేరున్న హిల్ స్టేషన్స్ ని తలుచుకుంటే ముందుగా షిమ్లా ఆ తరువాత కులూ మనాలి, లేదంటే ముందుగా కులూ మనాలి ఆ తరువాత షిమ్లా పేర్లే గుర్తుకొస్తుంటాయి.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ :
డార్జిలింగ్ పేరెత్తితే అక్కడి హిమాలయాల అందాలతో పాటుగు గుర్తుకొచ్చేది అక్కడి కొండలపై పచ్చదనం పర్చినట్టుగా ఉన్న తేయాకు తోటలు. డార్జిలింగ్ హిల్ స్టేషన్ కి వెళ్తే.. కాంచన్‌జంగా రేంజ్ లోని అందమైన దృశ్యాలను చూసే అవకాశం కలుగుతుంది. ఈ హిల్ స్టేషన్ లో కనిపించే మరో ప్రత్యేకత ఏంటంటే.. టాయ్ ట్రైన్లో అక్కడి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం లభిస్తుంది.
మున్నార్, కేరళ :
కేరళలోని పశ్చిమ కనుమల్లో పచ్చని తేయాకు తోటలు, అందమైన ప్రకృతి పరవశించే ప్రదేశాలకు వేదికే ఈ మున్నార్. అంతేకాకుండా మున్నార్‌కి సమీపంలోని ఎరవికులం నేషనల్ పార్క్ జంతు ప్రేమికులకు స్వర్గధామంగా పేరుంది.
ఊటీ, తమిళనాడు :
ఊటీ గురించి కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఊటీని నేరుగా చూసి ఉంటారు. లేదంటే ఎన్నో సినిమాల్లో ఊటీ అందాలను వీక్షించే ఉంటారు. ఊటీనే ఉదగమండలం అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రదేశానికి " క్వీన్ ఆఫ్ నీలగిరిస్" అనే పేరు కూడా ఉంది. ఇక్కడి బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్, నీలగిరి మౌంటైన్ ఇక్కడి ఎట్రాక్షన్స్.
ముస్సోరీ, ఉత్తరాఖండ్ :
ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ముస్సోరీ అందమైన హిల్ స్టేషన్ ప్రాంతాల్లో ఒకటి. కెంప్టీ ఫాల్స్, మాల్ రోడ్ షాపింగ్, ఎత్తు వంపులను తలపించే ఇక్కడి కొండలు, లోయలు చూసి తీరాల్సిందే.
నైనితాల్, ఉత్తరాఖండ్ :
ఉత్తరాఖండ్‌లోని నైనితాల్కి అందమైన హిల్ స్టేషన్ అని పేరుంది. పర్వతాల మధ్య ఉన్న నైనితాల్ సరస్సు పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే నైనా దేవి ఆలయం కూడా మనసుకు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందిస్తుంది.
కూర్గ్, కర్ణాటక :
కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రదేశాన్ని "స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తుంటారు. అందుకు కారణం అక్కడి కూర్గ్ కాఫీ తోటలు, దట్టమైన అడవులే. ఆహ్లాదకరమైన వాతావరణానికి కూర్గ్ పెట్టింది పేరు. అబ్బే వాటర్ ఫాల్స్, రాజా సీట్ వ్యూ పాయింట్ వంటి ప్రదేశాలు ఇక్కడ తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్.
గుల్మార్గ్, జమ్మూ అండ్ కశ్మీర్ :
పచ్చికభూములతో పచ్చటి తివాచీ పర్చినట్టుగా ఉండే మైదానాలు, మంచుతో కప్పినట్టుండే ఎత్తైన శిఖరాలు గుల్మార్గ్ వీక్షకులను ఆకట్టుకునే అంశాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్లలో ఇక్కడి గుల్మార్గ్ గొండోలా కూడా ఒకటి.
ఇది కూడా చదవండి : Newborn Baby Walking: పుట్టగానే లేచి నడిచిన బాలుడు..బిత్తరపోయిన పేరెంట్స్, డాక్టర్స్
కొడైకెనాల్, తమిళనాడు :
కొడైకెనాల్‌ను " ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్" అని పిలుస్తారు. అంటే అందమైన హిల్ స్టేషన్స్‌కి కొడైకెనాల్ ఒక యువరాణి లాంటిది అని అర్థం అన్నమాట. ఈ ఒక్క పోలికతోనే ఈ ప్రదేశం ఎంత అందమైందో తెలుసుకోవచ్చు. అందమైన ప్రదేశాలు సరస్సులు, ప్రకృతి వనాలు, జలపాతాలు, దట్టమైన అడవులకు కొడై కెనాల్ చాలా ఫేమస్. కోడై లేక్ , పిల్లర్ రాక్స్ ఇక్కడికి వచ్చే పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంటాయి.
ఇది కూడా చదవండి : Rx 100 Sound Viral Video: ఒరేయ్ ఏంట్రా అది..అది నోరా లేదా RX 100 బైక్ సైలెన్సరా..అచ్చు గుద్దినట్టు దింపావుకదరా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి