Funny Video: కొమ్ములున్నాయి కదా అని విర్రవీగితే ఏం జరుగుతుందో ఈ ఫన్నీ వీడియో చూడండి!

Funny Video: ఫన్ని వీడియోలకు ఇంటర్నెట్​లో కొదవే లేదు. ఆ జాబితాలోని ఓ కొత్త వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ వీడియోను చూసేద్దామా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 09:00 PM IST
  • ప్లాస్టిక్​ టబ్​పై గొర్రె ప్రతాపం
  • గాల్లోకి ఎగిరిపడ్డాక జ్ఞానోదయం
  • ఇన్​స్టాలో వైరల్ అవుతున్న వీడియో
Funny Video: కొమ్ములున్నాయి కదా అని విర్రవీగితే ఏం జరుగుతుందో ఈ ఫన్నీ వీడియో చూడండి!

Funny Video: ఇంటర్నెట్​లో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించినవే (Funny Animal Video) ఉంటాయి.

ఎందుంకంటే.. జంతువులు చేసే కొన్ని చిలిపి పనులంటే అందరూ చాలా ఇష్టపడుతుంటారు.

అందుకే ఇంటర్నెట్​లో వైరల్ అయ్యే జంతువుల వీడియోల్లో చాలా వరకు.. ఫన్నీ పనులు చేస్తున్నవే ఉంటాయి. కొన్ని సార్లు వేర్వేరు రకాల జంతువులు మధ్య స్నేహం, మరికొన్ని సార్లు అవి చూపించే విశ్వాసానికి సంబంధించిన వీడియోలు ట్రెండవుతున్నాయి.

ఇక తాజాగా ఓ గొర్రెకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో (Sheep Funny Video) ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో  ఏముందంటే..

సాధారణంగా జంతువులు ఏదైనా కొత్త వస్తువులను చూస్తే విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి అనుభవమే ఓ గొర్రెకు ఎదురైంది. దూరంగా పడి ఉన్న ఓ నల్ల రంగు ప్లాస్టిక్​ టబ్​ను​ చూసి తనకేదో హాని ఉందని భావించినట్లుంది ఆ గెర్రె. అంతే ఆ ప్లాస్టిక్​ టబ్​ పై దాడికి దిగింది.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్సాస్టిక్ టబ్​పైకి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. దాని తలతో టబ్​ను గుద్దడంతో.. ఆ టబ్​లో తల ఇరుక్కుని.. గొర్రె బోల్తా పడింది. మళ్లీ లేచే సరికి ఆ టబ్​ పక్కకు పడింది.

ఆ టబ్​ తనకంటే బలమైందని అనుకుందో ఏమో గానీ.. మరోసారి దానిపై దాడి చేయడానికి మాత్రం ఆ గొర్రె సాహసం (Sheep Funny Fight with plastic tub) చేయలేకపోయింది.

ఈ ఫన్నీ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది వీడియోలో చిత్రికరించారు. ఆ వీడియోను animalcritter అనే ఇన్​స్టా పేజీలో 4 రోజుల క్రితం అప్లోడ్​ చేయగా.. ఇప్పటి వరకు 32 లక్షల మందికిపైగా వీక్షించారు. మరి ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.

Also read: Monkey Gives a Hug: మనిషిని హత్తుకుంటూ భావోద్వేగానికి లోనైనా కోతి

Also read: Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మొసలి దాడి.. తెలిసి తెలిసి ప్రాణాల మీదకు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News