Giant King Cobra Drinks Water: ప్లాస్టిక్ బాటిల్‌లోని సగంకుపైగా నీటిని తాగిన కింగ్ కోబ్రా..వీడియో తెగ వైరల్..

Giant King Cobra Drinks Water: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాము నీటిని తాగే వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి వీడియోలు ఎప్పుడూ చూడలేదు అంటూ.. కామెంట్లు కూడా చేస్తున్నారు. మీరెప్పుడైనా ఇలా పాములు నీరు తాగే వీడియోని చూశారా.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2023, 08:25 PM IST
Giant King Cobra Drinks Water: ప్లాస్టిక్ బాటిల్‌లోని సగంకుపైగా నీటిని తాగిన కింగ్ కోబ్రా..వీడియో తెగ వైరల్..

 
Giant King Cobra Drinks Water: మనుషులకే కాదండోయ్ జంతువులకు పక్షులకు కూడా ఆకలి దాహం వేయడం సహజమే.. ప్రాణి అన్నాక మనిషి చేసే కొన్ని పనులైన పక్షులు జంతువులు చేయగలుగుతాయి. అయితే పక్షులకు జంతువులకు కొన్ని కాలాల్లో ఆహారాలు నీరు లభించడం చాలా కష్టం అవుతుంది దీని కారణంగా జంతువులు, పాములు, పక్షులు జనసంచానం చేస్తాయి. ముఖ్యంగా మనం అడవి ప్రాంతాలలో ఉన్న కొన్ని గ్రామాల్లో తరచుగా పాములు, ఎలుగుబంట్లు సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా ఆహారాల కోసం సంచారం చేస్తూ గ్రామాలలో ఉన్న ప్రజల్ని భయాందోళన గురిచేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. రోజు కూడా ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

 
 
 
 
 

మనం తరచుగా జనసంచారాల్లో పాములు సంచరించడం చూస్తూ ఉంటాం.. ఆ పాములు ఊరికనే వాటికవే ప్రజలున్న ప్రదేశాల్లోకి రావు.! ఆహారం లభించకపోవడం వల్ల దాహం వేయడం కారణంగాను సంచరిస్తూ ఉంటాయి. ఇటీవల ఓ పాము కూడా అదే చేసింది.. వేసవికాలం కావడం వల్ల అడవిలో నీరు లభించకపోవడంతో.. ఓ పాము నీటిని వెతుక్కుంటూ గ్రామ శివారులోని ఓ ప్రదేశంలో దర్శనమిచ్చింది. అయితే ఆ పాము చీటికిమాటికి నోరు తెరవడం గమనించి అక్కడే ఉండే కొంతమంది పాముకు ప్లాస్టిక్ బాటిల్‌తో నీటిని పట్టించారు. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

వీడియోలో గమనిస్తే.. కొందరు వ్యక్తులు పాముకు ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిని తాగించడం మీరు చూడవచ్చు. అయితే ఆ పాము దాదాపు సగం బాటిల్ నీళ్లను తాగింది. ఇది చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. పాములు సహజంగా నీటిని తాగడం మనం ఇప్పటికీ ఎప్పుడూ చూడలేదు. అయితే ఈ వీడియో అక్కడ ఉండే స్థానికుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతుంది.  ఇప్పటికీ ఈ వీడియోను కొన్ని వేలమంది వీక్షించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాసుకు వస్తున్నారు.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News