/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

ఈ రోజు ఫేస్‌బుక్‌‌ను దాదాపు అందరూ వాడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడేవారైతే ఫేస్‌బుక్‌‌ యాప్‌ను సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్‌‌‌‌లో ఫోన్ నెంబర్ కూడా అప్ డేట్ చేస్తున్నవారు ఎక్కువవుతున్నారట. అలా ఫోన్ నెంబర్ అప్‌డేట్ చేసుకొనే అవకాశం ఫేస్‌బుక్‌‌ కల్పించినప్పటికీ.. అది మీ సైబర్ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని కూడా అంటున్నారు పలువురు సైబర్ నిపుణులు.

  • సాధారణంగా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోకుండా..  ఫేస్‌బుక్‌‌‌లో ఫోన్ నెంబరు ఇవ్వడం వల్ల, మీ ఫేస్‌బుక్‌‌ ఖాతాని ఎవరైనా, ఎప్పుడైనా ట్రేస్ చేసే అవకాశం ఉంది. అంటే కేవలం సోషల్ మీడియాలో ఉండే మీ స్నేహితులు, బంధువులే కాకుండా ఎవరో మనకు తెలియని అపరిచితులకు, ఆగంతకులకు కూడా మన నెంబరు అందుబాటులోకి వస్తుందన్న మాట. 
  • అప్పుడప్పుడు భద్రతా కారణాల వలన మీ ఫేస్‌బుక్‌‌ అకౌంట్‌ను ఫోన్ నెంబరుతో చెక్ చేసుకోమని ఎఫ్‌బీ టీమ్ నుండి మీకు మెసేజ్ రావచ్చు. అలాంటప్పుడు మీరు ఫోన్ నెంబరు ఎంటర్ చేశాక.. వెరిఫికేషన్ నిమిత్తం ఓటీపిని మీ నెంబరుకి పంపిస్తారు. మీరు ఓటిపీని నమోదు చేసి, వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నాక, వెంటనే మీ ఫోన్ నెంబరును అక్కడ నుండి డిలీట్ చేసేయాలి. లేకపోతే అదే ఫోన్ నెంబరు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది. 
  • కొందరు హ్యాకర్లు మీ ఫోన్ నెంబరు సహాయంతో మీ ఫేస్‌బుక్‌‌ అకౌంట్‌ను హ్యాక్ చేసే విధంగా కూడా ప్లాన్ చేయవచ్చు. మీ అకౌంట్ పాస్‌వర్డులు కూడా మార్చేయవచ్చు. 
  • మీరు మీ ఫోన్ నెంబరును ఫేస్‌బుక్‌‌‌లో ఒకసారి ఇచ్చినా సరే.. దానిని చాలా తేలికగా ట్రేస్ చేసేయగలరు కొందరు హ్యాకర్లు.
  • అయితే ఈ సమస్య నుండి తప్పించుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది ఫేస్‌బుక్‌‌. ఫేస్‌బుక్‌‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరు మీ ప్రైవసీ ఆప్షన్లను మార్చుకొని.. కేవలం మీ ఫేస్‌బుక్‌‌ సమాచారం స్నేహితులు తప్ప ఇంకెవరూ చూడకూడదనే ప్రాధమ్యాన్ని ఎంచుకుంటే మీ ఖాతా భద్రంగా ఉంటుంది. అలాగే మీ పూర్తి ఫేస్‌బుక్‌‌ ఆప్షన్లు కొంతమంది స్నేహితులకు మాత్రమే కనిపించేలా కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. 
  • మీ ఫేస్‌బుక్‌‌ ఖాతాను మీరు పబ్లిక్ జోన్‌లో ఉంచినన్ని రోజులూ... మీ సమాచారాన్ని ఎవరైనా ఎప్పుడైనా చూడగలుగుతారనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 
Section: 
English Title: 
Giving Phone Number in Facebook may distract your Cyber security
News Source: 
Home Title: 

ఫేస్‌బుక్‌లో ఫోన్ నెంబర్ ఇస్తే ప్రమాదమే..!

ఫేస్‌బుక్‌లో ఫోన్ నెంబర్ ఇస్తే ప్రమాదమే..!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes