Iphone 15 Pro Max: అడుక్కున్న చిల్లర నాణేలతో iPhone 15 Pro Max కొనుక్కున్న బిచ్చగాడు..తెగ వైరల్ అవుతున్న వీడియో..

Young Begger Buy Iphone 15 Pro Max Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బిచ్చగాడు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా ఆ బిచ్చగాడు బిక్షాటన చేసిన చిల్లర నాణాలను యాపిల్ స్టోర్ కి తీసుకెళ్లి మరి మొబైల్ కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2024, 11:00 PM IST
Iphone 15 Pro Max: అడుక్కున్న చిల్లర నాణేలతో iPhone 15 Pro Max కొనుక్కున్న బిచ్చగాడు..తెగ వైరల్ అవుతున్న వీడియో..

 

Young Begger Buy Iphone 15 Pro Max Viral Video: ఐఫోన్ ధరల గురించి నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల మీన్స్ వైరల్ అవుతూ ఉంటాయి. వీటిని సాధారణ వినియోగదారులు కొనాలంటే ఆస్తుల అమ్ముకోవాల్సిందే అనే మాటలు నిత్యం అక్కడక్కడ వింటాం. అయితే యాపిల్ ఫోన్ ప్రీమియం డిజైన్ అతిశక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.. కాబట్టి రేటు కూడా అంతే ఉంటుంది. అందుకే సామాన్యులకే కాదు, దీనిని మిడిల్ క్లాస్ వాళ్లు కూడా కొనుగోలు చేయడం చాలా కష్టం. అయితే ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ మొబైల్స్ ను చాలామంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కొనుగోలు చేశారంటే నమ్మశక్యం కాదు కదా.. అవును చాలామంది యాపిల్ ఫోన్ అంటే పిచ్చి ఉన్నవారు లోన్లు తీసుకొని మరి వీటిని కొనుగోలు చేశారు. 

అయితే యాపిల్ మొబైల్ అంటే పిచ్చి ఉన్న ఓ బిక్షాటన చేసే యువకుడు కూడా తన దగ్గర ఉన్న మొత్తం చిల్లర నాణాలతో ఏకంగా యాపిల్ స్టోర్‌కు వెళ్లి మరీ యాపిల్ 15 ప్రో మాక్స్‌ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? నిజంగానే ఆ బిచ్చగాడు చిల్లర డబ్బులతో యాపిల్ ఫోన్ కొన్నాడా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వీడియోలో ఉన్న వివరాల ప్రకారం.. ఒంటిపై చినిగిపోయిన దుస్తులు, శరీరమంతా మురికితో ఉన్న ఓ అడుక్కునే బిచ్చగాడు.. నిత్యం రద్దీగా ఉండే ఓ యాపిల్ స్టోర్ కి రావడం మీరు గమనించవచ్చు. చూడడానికి ఎంతో అసహ్యంగా ఉన్నా ఆ బిచ్చగాడు స్టోర్ కి ఎందుకు వచ్చారనే ప్రశ్నతో అక్కడి సిబ్బంది ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు చూశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న హై క్లాస్ కస్టమర్స్ కూడా ఆ బిచ్చగాడిని చూసి అసహ్యించుకున్నారు. అయితే ఇంతలోనే ఆ బిచ్చగాడు ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ మొబైల్ ఒకసారి చూపించమని అడుగుతాడు. సిబ్బంది మీకెందుకని ఆ బిచ్చగాడిని ప్రశ్నించగా, అతను ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను కొనుగోలు చేసేందుకు వచ్చానని చెబుతాడు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

దీంతో అక్కడ పనిచేస్తున్న స్టోర్స్ సిబ్బంది, మొబైల్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఆ బిచ్చగాడు ఏదో జోకులు వేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ తన సంచిలో ఉన్న చిల్లర నాణాలను ఒక్కసారిగా అక్కడ ఉన్న బల్లపై గుమ్మడిస్తాడు. దీంతో అక్కడున్న జనాలంతా మరోసారి షాక్ అవుతారు. అతను తీసుకు వచ్చిన డబ్బును తీసుకొని యాపిల్ 15 ప్రో మాక్స్ ను ఇవ్వమని కోరుకుంటారు. దీంతో అందులో పని చేస్తున్న స్టోన్ సిబ్బంది అంతా ఆ చిల్లర నాణేలను లెక్కపెట్టడం ప్రారంభిస్తారు. ఆ బిచ్చగాడు తీసుకొచ్చిన రూ. 1,59,000 తీసుకొని ఐఫోన్ 15 ప్రో మాక్స్ ను అందజేస్తారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News