Rat Snake Viral Video: స్నేక్ క్యాచర్ ను ముప్పుతిప్పలు పెట్టిన రాట్ స్నేక్.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ను షేక్  చేస్తోంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 03:50 PM IST
Rat Snake Viral Video: స్నేక్ క్యాచర్ ను ముప్పుతిప్పలు పెట్టిన రాట్ స్నేక్.. వైరల్ అవుతున్న వీడియో..

Snake Catcher Razak Shah Catches rat snake: మనలో చాలా మందికి పాములు అంటే భయం. పామును చూస్తే వెనక్కి కూడా చూడకుండా పారిపోతూ ఉంటాం. అయితే కొంత మంది మాత్రం చాలా దైర్యంగా సింపుల్ గా స్నేక్స్ ను పట్టేస్తుంటారు. నిజంగా అలాంటి వారిని చూస్తే వావ్ అనకు తప్పదు. ఎందుకంటే వీరు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాములను క్యాచ్ చేయడానికి వెళ్తారు. 

ఈ భూమ్మిద ఎన్నో రకాల పాములు ఉన్నాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి, మరికొన్ని సాధారణమైనవి. కింగ్ కోబ్రా, ఇన్ లాండ్ తైపాన్, సీ స్నేక్ వంటి భయంకరమైన పాములు కుడితే నిమిషాల్లో ప్రాణాలు వదిలేయాల్సి వస్తుంది. అయినా ఈ మధ్య సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ స్నేక్ క్యాచర్ చాలా రిస్క్ చేసి రాటిల్ స్నేక్ (Rat Sanke) ను పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి మరి. 

వీడియో ఓపెన్ చేస్తే.. కర్నాటకకు చెందిన రజాక్ షా అనే స్నేక్ క్యాచర్ కు ఓ ఇంట్లో పాము ఉందని కాల్ వస్తుంది. అతడు స్నేక్ ప్లేస్ కు తన బైక్ పై వస్తాడు. ఓ ఇంట్లో సామాన్లు కింద నక్కి ఉన్న పామును చూస్తాడు. అక్కడ ఉన్న వస్తువులన్నీ తొలగించి పామును పట్టుకుంటాడు. ఇతడు పట్టుకున్న పాము  పేరు రాట్ స్నేక్. మనం తెలుగులో దీన్ని జెర్రిపోతు అని కూడా పిలుస్తాం. అయితే ఈ రాట్ స్నేక్ ఇతడిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఒకసారి అతడి తలపై కూడా కాటేయబోతుంది. చివరకు దానిని అతడి ఓ అడవిలో విడిచిపెడతాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: Viral Video: వామ్మో ఇదేమి రా సామీ..చెట్టును ఇలా ఎక్కేసింది..కొండ చిలువ వీడియో వైరల్..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News