Shocking Video: పాముకి ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video today: తన బిలంలోకి దూరిన పాముతో ఓ పక్షి ఫైట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ రెండింటి మధ్య పోరు చూస్తే షాక్ అవ్వాల్సిందే.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 22, 2022, 06:25 PM IST
  • పాముతో పక్షి పైట్
  • వైరల్ అవుతున్న వీడియో
Shocking Video: పాముకి ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video today: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాక్ కు గురిచేస్తాయి. ఈ మధ్య పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సాధిస్తున్నాయి. పాములు చాలా ప్రమాదకరమైనవి..ఇవీ ఒక్కసారి కాటువేస్తే చాలు ప్రాణం పోతుంది. అందుకే చాలా మంది పాములను చూసి భయపడతారు. పాములు సాధారణంగా చీమలు పెట్టిన పుట్టల్లో ఉంటాయి. కొన్ని పాములు చెట్లు మీద పాకుతూ పక్షి యెుక్క బిలంలోకి చొరబడి వాటి పిల్లలను చంపుకు తింటూ ఉంటాయి. తాజాగా ఓ పక్షి యెుక్క కన్నంలోకి వెళ్లిన పాముకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

వీడియో ఓపెన్  చేస్తే.. ఇందులో ఓ పాము వండ్రింగి పిట్ట యెుక్క కన్నంలోకి చొరబడుతుంది. దీంతో ఆ పక్షి పాముతో ఫైట్ కు సిద్దమవుతుంది. ఆ స్నేక్ ను తన ముక్కుతో గుచ్చుతూ గాయం చేస్తుంది. పదే పదే దాడికి పాల్పడుతుంది. పాము కూడా ఆ పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రెండు సార్లు పట్టుకుంటుంది కూడా. నోటిలో చిక్కినట్టే చిక్కి ఆ పక్షి తప్పించుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @planet_visit

Also Read: OMG Video: దించకుండా బీర్ కొట్టి.. బాహుబలి ఎద్దుతో ఫైట్ కు దిగిన మేక.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News