Aadhaar History: ఆధార్ ప్రతీ భారతీయుడుకి.. అధికారిక గుర్తింపు. ప్రస్తుతం చాలా అవసరాలకు ఆధార్ తప్పనిసరి. సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, రేషన్ రావాలన్నా, పాస్‌పోర్ట్ కావాలన్నా, బ్యాక్ ఖాతా తెరవాలన్నా.. ఇంకా ఎన్నో అవసరాలకు ఆధార్ తప్పనిసరి.
ఇలా ఎన్నో అవసరాలకు తప్పనిసరి అయిన కారణంగా ఆధార్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే చాలా మంది ఆధార్ కార్డ్‌లను అక్రమంగా వినియోగించుకుంటున్న సందర్భాు కూడా బయటపడ్డాయి. దీనితో ప్రతి ఒక్కరూ తమ ఆధార్ ఎక్కడ వినియోగమైందో తెలుసుకునేందుకు వీలు కల్పిస్తోంది ఆధార్ కార్డులను పర్యేవేక్షించే 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)'.
మరి మీకూ మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవాలని ఉందా? అయితే అందుకో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆధార్ హిస్టరీ తెలుసుకోవాలంటే..
- ముందుగా uidai.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో హోం పేజీలోనే ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చను ఎంటర్ చేయాలి. అప్పుడి రిజిస్టర్ మొబైల్ నంబర్కో ఓ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి.
- అందులో అథేంటికేషన్ వివరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలో ఎంపిక చేసుకుని.. దానిని పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఆ హిస్టరీని చూడాలంటే పాస్వర్డ్ తప్పనిసరి. ఆ పాస్వర్డ్ ఏమిటంటే.. మీ పేరులో మొదటి నాలుగు అక్షరాలు (ఇంగ్లీష్), బర్త్ ఇయర్ ఎంటర్ చేయాలి, ఎలాంటి స్పేస్ ఎంటర్ చేయొద్దు.
- దీనితో ఆ డాక్యుమెంట్ ఒపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్ నంబర్ ఎక్కడెక్కడ వాడారు. అనే వివరాలు ఉంటాయి. అందులో మీకు సంబంధించినది లేనట్లు అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
Also read: Viral Video: కదులుతున్న ఆటో ట్రాలీ నుంచి చోరీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Also read: Shocking Video: మద్యం మత్తులో కత్తితో పొడుచుకున్న యువకుడు.. చికిత్స పొందుతూ మృతి- వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook